తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ సాయిపల్లవి ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారనే విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని కోత్తగిరి గ్రామంలో జన్మించిన సాయిపల్లవి 2017 సంవత్సరంలో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. సాయిపల్లవి ఐదేళ్ల సినీ కెరీర్ లో తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, లవ్ స్టోరీ సినిమాలు మాత్రమే హిట్లుగా ఉన్నాయి. తమిళంలో సాయిపల్లవి పలు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.
టాలెంట్ ఉన్నా సాయిపల్లవికి సక్సెస్ రేట్ ఎక్కువగా లేదు. కథల ఎంపిక విషయంలో సాయిపల్లవి చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లు సాయిపల్లవిని సక్సెస్ కు దూరం చేస్తున్నాయి. సాయిపల్లవి రీమేక్ సినిమాల్లో నటించడానికి నో చెబుతుండటం వల్ల ఆమెకు ఆఫర్లు తగ్గుతున్నాయి. కథ, పాత్ర బాగుంటే సాయిపల్లవి రీమేక్ సినిమాల్లో కూడా నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డాక్టర్ చదివి యాక్టర్ అయిన సాయిపల్లవి నటించిన విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
విరాటపర్వంలో హీరోగా నటించిన రానా, శ్యామ్ సింగరాయ్ లో హీరోగా నటించిన నాని ప్రస్తుతం సక్సెస్ లో లేరు. సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమాకు ముందు కణం, మారీ2, ఎన్జీకే సినిమాలతో నిరాశపరిచారు. కథలో ప్రత్యేకత ఉన్న పాత్రలనే సాయిపల్లవి ఎంచుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ లతో సాయిపల్లవి మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. మరోవైపు సాయిపల్లవి ఇతర హీరోయిన్లలా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదని తెలుస్తోంది.