ఫ్యామిలీ మ్యాన్ హీరోగా ఓ ఊపు ఊపేసిన జగపతి బాబు.. ఇక కెరీర్ డౌన్ అవుతోందన్న సమయంలో విలన్‌గా మారి వావ్ అనిపించాడు. అప్పటివరకు సాఫ్ట్ హీరోగా, అప్పుడప్పుడు అగ్రెసివ్ హీరోగా కనిపించిన జగ్గూ భాయ్… విలన్‌గానూ మెప్పించాడు. అయితే మధ్య మధ్యలో కొన్ని కాన్సెప్ట్ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ వచ్చాడు. మంచి కథ వస్తే కీలక పాత్రలో కనిపించడానికి ఓకే అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు లీడ్ రోల్స్ గురించి జగ్గూ భాయ్ కామెంట్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
జగపతి బాబు దేనికీ భయపడడు అంటుంటారు. సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయో, బయట కూడా అలానే ఉంటాడు. తన మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అలా తన తాజా సినిమా ‘FCUK’ (ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్) గురించి అలానే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాల్లో లీడ్ రోల్ అంగీకరించాలంటే చాలా భారంగా ఉంటోందని చెప్పిన జగపతిబాబు… ఈ సినిమా విజయం సాధిస్తే తనకు బూస్టింగ్‌లా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రచార చిత్రాలు చూస్తుంటే బూస్ట్ వచ్చేలానే ఉంది.
ఇదంతా బాగుంది కానీ… జగపతిబాబు లాంటి నటుడు లీడ్ క్యారెక్టర్స్ గురించి ఇలా అనడం ఏంటి అనేదే ప్రశ్న. ముందుగా చెప్పుకున్నట్లే జగ్గూభాయ్ చాలా డేర్ అండ్ డ్యాషింగ్. అలాంటిది లీడ్ యాక్టర్ బర్డెన్ అని ఎలా అంటాడు. అంటే హీరో అయితే ఓకే కానీ, ఇలా హీరో కాని హీరో అయితే కష్టం అని అనుకుంటున్నాడేమో జగ్గూ భాయ్.