బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు జబర్దస్త్ కార్యక్రమంలోనూ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోనూ సందడి చేస్తున్నటువంటి ఈయన తన పంచ్ డైలాగులతో అందరిని పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉన్నారు. ఇలా అందరిని నవ్వించే ప్రసాద్ జీవితంలో ఎంతో విషాదం ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల క్రితం పంచ్ ప్రసాద్ 2 కిడ్నీలో ఫెయిల్ కావడంతో ఈయన తరచూ డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.
అయితే ఈయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని అలా చేస్తేనే ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు అంటూ డాక్టర్లు వెల్లడించారు.కిడ్నీ కూడా దొరికింది అంటూ గతంలో ఈయన భార్య సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా మరోసారి ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా మారిందని కమెడియన్ నూకరాజు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.
ఇందులో భాగంగా (Punch Prasad) ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా మారిందని వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారంటూ నూకరాజు వెల్లడించారు. సర్జరీ చేయడం కోసం భారీగా డబ్బు అవసరమైందని ఈయన తెలిపారు. ఇలా పంచ ప్రసాద్ అన్నకు కిడ్నీలు పాడవడంతో ఇతర సమస్యలు కూడా తనను వెంటాడుతున్నాయని ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోతుందని తెలిపారు. అయితే వెంటనే సర్జరీ చేస్తే తనకు ఎలాంటి ప్రమాదం ఉండదని లేకపోతే ఏ క్షణం ఏమైనా జరగవచ్చని వైద్యులు చెప్పినట్లు నూకరాజు వెల్లడించారు.
సర్జరీ చేయించడానికి భారీగా డబ్బు అవసరం అవుతుందని తెలిపారు. దీంతో తనకు ఆర్థికంగా డబ్బు సహాయం చేసే దాతల కోసమే ఎదురు చూస్తున్నట్లు నూకరాజు తెలిపారు. ఇక ఈ వీడియోలో భాగంగా ఎవరైనా డబ్బు సహాయం చేయాలి అనుకుంటే చేయవచ్చు అంటూ నూకరాజు ప్రసాద్ భార్య బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్ పే నెంబర్ ని కూడా మెన్షన్ చేస్తూ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.