ఐటెం భామను వెతికే పనిలో పడిన జై లవ కుశ బృందం
- June 14, 2017 / 05:58 AM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తొలి సారి తారక్ త్రి పాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ లు ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్నారు. వీరితో పాటు మరో భామ ఈ సినిమాలో అందాలను ఆరబోయనుంది. ఆ భామ కోసం ప్రస్తుతం బాబీ బృందం వెతికే పనిలో పడింది. ఎందుకు నాలుగో భామ అవసరం ఏర్పడిందంటే.. ఈ మూవీ కోసం దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన ఐటెం సాంగ్ ని కంపోజ్ చేసారంట. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ పాట మాస్ అభిమానుల్లో ఉత్సాహాన్నినింపింది. కాజల్ ఆ పాటకి మరింత కిక్ ఇచ్చింది.
ఇప్పుడు జై లవకుశ కోసం చేసిన పాటలో మత్తెక్కించే భామ ఎవరైతే బాగుంటుందా? అని చిత్ర బృందం ఆలోచనలో పడింది. బాలీవుడ్ భామ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. త్వరలో ఆమె ఎవరో బయటికి రానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












