కొరటాల శివ సినిమా అంటే… మాస్, మెసేజ్ మేళవింపు పక్కా అంటుంటారు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ అలానే సాగాయి. త్వరలో విడుదల కానున్న ‘ఆచార్య’లో కూడా మాస్ + మెసేజ్‌ఉండబోతోంది. ఇప్పటివరకు బయటకొచ్చిన విషయాల బట్టి అదే తెలుస్తుంది. కొరటాల తర్వాతి సినిమా కూడా ఇలానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన మెసేజ్‌ను రిపీట్ చేస్తున్నారా? కొత్త పుకార్లు వింటుంటే అవుననే అనిపిస్తోంది. తారక్ – కొరటాల శివ సినిమా అని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా ప్రారంభం ఆలస్యమవుతూ వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ తర్వాత ఈ సినిమా మొదలుపెడదాం అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. మార్చి 25 అంటూ కొత్త డేట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొరటాల సినిమా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. షూటింగ్ మొదలైన వెంటనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో నాయికగా ఆలియా భట్ మ్యాగ్జిమమ్ కన్‌ఫామ్ అని టాక్.
ఇప్పటివరకు తారక్ – కొరటాల సినిమా స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్ అని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ అని అంటున్నారు. అడవుల రక్షణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తాజా సమాచారం. అడవుల్ని రక్షించడానికి ఓ యువకుడు చేసే ప్రయత్నమే ఈ సినిమా తెలుస్తోంది. ఈ చిత్రానికి `రుద్ర` అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి స్టూడెంట్ పాలిటిక్స్ ఈ సినిమాలో ఉంటాయా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
తారక్ నుండి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అవుతాయని అనుకున్న ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇటు సినిమా పరంగా, అటు రియల్ పాలిటిక్స్ పరంగా తారక్‌కు ఎలివేషన్ ఉంటుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు అడవులు బ్యాక్‌డ్రాప్ అనడంతో పరిస్థితి అయోమయంగా మారింది. తారక్ – కొరటాల కాంబోలో ‘జనతా గ్యారేజ్’ మొక్కల గురించి సందేశం ఉంటుంది. ఇప్పుడు కొత్త సినిమాలో అడవుల గురించి సందేశం ఉండబోతోంది అన్నమాట.