దివంగత స్టార్ హీరో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు మూడు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఈ క్రమంలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, వంటి వారితో పాటు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉమా మహేశ్వరి పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు జూబ్లీహిల్స్ లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన మేనత్తను చివరి చూపు చూసుకునేందుకు వెళ్ళలేదు.
ఉమా మహేశ్వరి పెద్ద కూతురు అమెరికా నుండి వస్తుందని బుధవారం వరకు అంత్యక్రియలు జరపకుండా ఆపారు నందమూరి కుటుంబ సభ్యులు.ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ వచ్చి వెళ్తాడు అనుకుంటే అలా జరగలేదు. అందుకు కారణం లేకపోలేదు.ఈ సంఘటన జరగడానికి ముందే ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశాడు. కానీ నందమూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్ కు ఉన్న విభేదాల కారణంగానే అతను హాజరు కాలేదు అంటూ ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ కు స్టార్ ఇమేజ్ వచ్చే వరకు మాత్రమే నందమూరి తారక రామారావు గారి పేరును, బాలకృష్ణ పేరును వాడుకున్నాడని..
వాడుకుని స్టార్ ఇమేజ్ వచ్చాక మాత్రం నందమూరి ఫ్యామిలీని పక్కన పెట్టాడని హార్డ్-కోర్ నందమూరి అభిమానులు మండిపడ్డారు. అయితే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. ఈరోజు అంటే 04-08-2022 మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్యలో ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నాడట. ఈ వార్తను ఎన్టీఆర్ సన్నిహిత వర్గం తెలియజేసింది.దీంతో ఎన్టీఆర్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.