ఎన్టీఆర్ 27 సినిమా విషయంలో వస్తున్న వార్తలను ఖండించిన కళ్యాణ్ రామ్
- December 28, 2016 / 07:15 AM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ సినిమా వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 9 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ మూవీని తమ బ్యానర్లో చేస్తున్నట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి బాబీ దర్శత్వం వహిస్తారని ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా నడుస్తున్న ఈ మూవీకి సంబంధించిన వార్తలు అనేకం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తారని, వారి సరసన కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్, మంజిమ మోహన్ ఆడి పాడనున్నారని, కళ్యాణ్ రామ్, హరికృష్ణ కీలక పాత్రలు పోషిస్తారని వార్తలు రాస్తున్నారు.
అయితే ఇవన్నీ నిజాలు కావని ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ లేటెస్ట్ గా వెల్లడించింది. వాటిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమ్మవద్దని సూచించింది. కాస్టింగ్, టెక్నీషియన్ విషయంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, ఫైనల్ కాగానే అధికారికంగా తామే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఈ మూవీకి సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎంపికైనట్లు వస్తున్న వార్త కూడా అవాస్తవమని తేలిపోయింది. ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి సంక్రాంతి తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అప్పుడే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














