ఎన్టీఆర్ టైటిల్ తీసుకున్న కళ్యాణ్ రామ్
- May 13, 2017 / 05:40 AM ISTByFilmy Focus
నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఇజం సినిమా తర్వాత తమ్ముడు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమాని నిర్మించేపనిలో పడ్డారు. ఆ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చూసుకొంటూనే తాను హీరోగా నటించే ప్రాజక్ట్ ని ఓకే చేశారు. ఉపేంద్ర మాధవ్ అనే ఓ యువ దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న మూవీకి తమ్ముడి సినిమా కోసం రిజిస్టర్ చేసిన పేరుని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ‘ఎం.ఎల్.ఏ’ (మంచి లక్షణాలు వున్న అబ్బాయి) అనే టైటిల్ని కల్యాణ్‌రామ్ సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ నెల మూడో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో కల్యాణ్‌రామ్ సరసన నటించే భామ కోసం అన్వేషిస్తున్నారు. ఇదివరకే కల్యాణ్‌రామ్ కి జోడీగా నటించిన ఓ సీనియర్ కథానాయికని ఎంపిక చేసే దిశగా కూడా చిత్రబృందం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మూవీ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














