యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినీ కెరియర్ గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తెరిగరాసింది.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనటువంటి ఈ సినిమా ఏకంగా 400 కోట్లు పైగా కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన రికార్డులు సృష్టించింది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత విక్రమ్ సినిమా ద్వారా కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తమిళంలో పాటు తెలుగులో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. థియేటర్ లో ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విధంగా థియేటర్ లోనూ డిజిటల్ మీడియాలోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టెలివిజన్లో మాత్రం ఘోరంగా రేటింగ్ కైవసం చేసుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సినిమా ప్రసారం కాగా ఈ సినిమా మాత్రం చాలా ఘోరమైన టీఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా 5.10 రేటింగ్ సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.థియేటర్లో సుమారు 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా టెలివిషన్లో మాత్రం తక్కువ రేటింగ్ సొంతం చేసుకుంది.అయితే థియేటర్లో డిజాస్టర్ గా నిలిచిన చిరంజీవి ఆచార్య సినిమా మాత్రం టెలివిజన్లు మంచి ఆదరణ రాబట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని భారీ నష్టాలను మిగిల్చిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాగా ఏకంగా 6.30 టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంది.ఇలా సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన విక్రమ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన ఆచార్య సినిమా రికార్డును బ్రేక్ చేయలేక పోయిందని చెప్పాలి.