మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం ‘ఖిలాడి’. గతంలో వీరి కాంబినేషన్లో ‘వీర’ అనే చిత్రం వచ్చింది. అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఈ సినిమా చేశారు. డింపుల్ హయాతి, మీనాక్షిచౌదరి హీరోయిన్లు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.పాటలన్నీ మంచి ఆదరణ పొందాయి.
ఫిబ్రవరి 11న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కాబోతోంది. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ ట్రైలర్ 24 గంటల్లో 6 మిలియన్లకి పైగా వ్యూస్ ను నమోదు చేసింది అంటే నార్త్ లో ఈ మూవీకి ఎంత క్రేజ్ నెలకొందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ ‘పెన్ స్టూడియోస్’ వారు ఈ చిత్రాన్ని ఓన్ గా రిలీజ్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ అక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.
టార్గెట్ పెద్దదేమీ కాదు కానీ మన రవితేజనే అక్కడి జనాలకి కొత్త. అయితే రవితేజ నటించిన తెలుగు సినిమాల్ని హిందీలో డబ్ చేయగా అవి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసాయి.అలాగే సౌత్ లో రూపొందే యాక్షన్ సినిమాలకి అక్కడ మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ‘ఖిలాడి’ కి అక్కడ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.