టాలీవుడ్ లెజెండ్స్ లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన యువసామ్రాట్ నాగార్జున తొలి సినిమాతోనే ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారారు అని చెప్పాలి. సినిమా…సినిమాకు సంభంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, 20లో యువసామ్రాట్ నుంచి 50+లో సైతం నవ మన్మధుడిగా టాలీవుడ్ రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్నాడు మన డాన్. ‘డాన్’ గా డమరుకం మోగించినా…అన్నమయ్యగా ఆలాపనలు అందించినా…రగడ పేరుతో రచ్చ చేసినా…గ్రీకువీరుడుగా అందాల భామల మనసు దోచినా అది మన ‘బాస్’ అలియాస్ ‘మాస్’….అక్కినేని అందగాడికే చెల్లింది.
అందమైన రూపంతో పాటు, తెలుగు తెరపై అద్భుతమైన నటనతో పాటు… నిర్మాతగానూ, బుల్లి తెరపై యాంకర్ గాను సైతం నాగ్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాడు. మరి అలాంటి నవరసాల నవమన్మధుడు నాగ్ సినీ కరియర్ లో కొన్ని అద్భుతాలను ఒక్కసారి చూద్దాం రండి…
టాలీవుడ్ చరిత్రలో ఎన్ని ప్రేమ కధలు తెరకెక్కినా, ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఈ గీతాంజలి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో తొలిసారి సంధించిన ‘ప్రేమ’ ఆయుధం అనేక ప్రభంజనాలకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ చిత్రంలో క్లైమ్యాక్స్ సీన్ లో నాగ నటన చూసి కన్నీళ్ళు పెట్టని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల మన్నలనే కానీ, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న చిత్రం….
‘సైకిల్’ చైన్ ను చేతికి చుట్టుకుని విలన్స్ భరతం పట్టే హీరో పాత్రలో నాగ్ దుమ్ము దులిపేసాడు అంతే. అసలు కాలేజీ కుర్రాడిగా ఎంట్రెన్స్ ఇచ్చే నాగ్, చివరకు బెజవాడ గ్యాంగ్స్ ను ఫినిష్ చేసే డాన్ గా మారే సీన్స్ టాలీవుడ్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. మాస్ హీరోగా నాగ్ కరియర్ కు ఈ సినిమా టైటల్ కార్డ్ గా నిలిచి పోతుంది. ఇక సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి…
ఇలా ట్రెండ్ కు పూర్తి వ్యతిరేకంగా, సరికొత్త ప్రయోగాలు చెయ్యడమే కాకుండా, వాటిని భారీ ప్రభంజనాలుగా మలచి, సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతూ వస్తున్నాడు నాగ్. మరి మన నవమన్మధుడు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు మరిన్ని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.