సోషల్ మీడియాను మంచికీ వాడుకోవచ్చు, చెడుకీ వాడుకోవచ్చు. అయితే మనం ఏ దారి ఎంచుకున్నాం అనేదే ముఖ్యం. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న ఈ సమయంలో చాలామంది సోషల్ మీడియాను సేవ కోసం వాడుకున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ వికృత బుద్ధిని చూపిస్తున్నారు. దీనికి సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పోయింది. సోషల్ స్నేహం మాటున విషయం గక్కుతున్నారు జనాలు. ఇప్పుడీ వేధింపులే ఎదుర్కొంది తమిళ నటి సౌందర్య నందకుమార్.
వీలుచిక్కినప్పుడల్లా అభిమానులతో ముచ్చటించడానికి సోషల్ మీడియాను సెలబ్రిటీలు వాడుకోవడం పరిపాటి. ఆ క్రమంలో కొంతమంది మెసేజ్‌లు చేసి దగ్గరవుతారు. వారేంటో పూర్తిగా తెలియకపోయినా ‘మంచివాడే ’ అయి ఉంటాడులే అని కొంతమంది స్నేహం చేస్తారు. అలా సౌందర్యకు ఓ వ్యక్తి తాను లెక్చరర్ అంటూ పరిచయం చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడు. మంచి హోదాలో ఉన్నవాడు కదా అని సౌందర్య మాటలు కలిపింది. తీరా నాలుగు రోజుల గడిచాక దారుణానికి ఒడిగట్టాడట.
ఇన్‌స్టా పరిచయాన్ని చనువుగా తీసుకొని ‘‘నాతో పడుకొంటావా? నీకు ఏమి కావాలంటే అది ఇస్తా. జస్ట్ నాతో పడుకోవాలి అంటూ మెసేజ్‌లు పెట్టాడట’’ఆ వ్యక్తి. ఆ సమయంలో ఏం చెప్పాలో అర్ధం కాని పరిస్థితి ఎదురైందని చెప్పింది సౌందర్య. వెంటనే తేరుకొని ఆ వ్యక్తిని సౌందర్య గట్టిగా మందలించిందట. అంతేకాదు అతనిపై పోలీస్ కంప్లైట్ చేస్తానంటోంది. అతను చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్ రూపంలో తీసుకుని ఉంచిదట. బాధ్యతాయుతమైన స్థానంలో ఎఉంది… ఓ మహిళతో ప్రవర్తించే తీరు అదేనా? ’’ అంటూ ప్రశ్నిస్తోంది సౌందర్య. ఆమె కొన్ని తమిళ సీరియల్స్‌లో నటించింది. దాంతోపాటు ‘మాస్టర్’ సినిమాలో ఇటీవల కనిపించి మెప్పించింది.