కోలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆంటోని ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా మీరా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఈమె మరణాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని వివిధ రకాల థంబ్ నైల్స్ పెడుతూ తమ ఛానల్ రేటింగ్ కోసం వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా విజయ్ ఆంటోని కుమార్తె మరణం విషయంలోనే కాదు ఇతర సెలబ్రిటీల మరణించిన సమయంలో కూడా మీడియా వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలను పదే పదే ప్రశ్నలు అడగటం అదేవిధంగా వారిని చూడటానికి వచ్చినటువంటి సెలబ్రిటీలతో మాట్లాడటం కోసం పెద్ద ఎత్తున ఎగబడటం వంటివి అందరిని కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఇలా బాదిత కుటుంబ సభ్యులను ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ వారిని మరింత బాధకు గురి చేస్తున్నారు. అలాగే వారి రేటింగ్స్ కోసం ఘోరమైన థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తమిళనాడు చిత్ర పరిశ్రమ నిర్మాత మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఏ సెలబ్రెటీ మరణించినా కూడా అక్కడికి మీడియాకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. మీడియా అలాగే యూట్యూబ్ ఛానల్ వారు ఆ సెలబ్రెటీ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడా కనిపించకూడదని (Kollywood) నిర్మాత మండలి సంఘం అధ్యక్షుడు భారతి రాజా పేర్కొన్నారు.
కుటుంబ బంధాలకు విలువ నిచ్చే ఈ సమాజంలో మీడియా వారు ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని తాను భావిస్తున్నారని తెలియజేశారు. ఒక వ్యక్తి చనిపోతే భారీగా నష్టం బాధ ఆ కుటుంబానికి ఉంటుందని మీడియా వారికి ఏమైనా సంబంధం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఇలా పలువురు సెలబ్రిటీల విషయంలో ఇదే పునరావృతం కావడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఈయన వెల్లడించారు.