Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రం!

ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రం!

  • August 14, 2019 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న  ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రం!

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌’. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 14న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, రచయిత హనుమాన్‌ చౌదరి పాల్గొన్నారు.

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ – ”ఈమధ్య కాలంలో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అన్ని సినిమాల్లోనూ జెంట్స్‌ చేశారు. మొదటిసారిగా మన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ అలాంటి స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంలో నటించింది. ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినప్పటికీ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం కనుక తప్పకుండా ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉండాలని ఆగస్ట్‌ 23న ఒక పెద్ద సినిమాగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్‌ దాదాపు 20 తమిళ సినిమాలే కాకుండా మలయాళం, హిందీలో ప్రముఖ నటుడు అర్జున్‌ రాంపాల్‌తో నటించి అన్ని భాషలతో పాటు నేషనల్‌ లెవల్‌లో మంచి పెర్ఫార్మర్‌గా పేరుతెచ్చుకొని ప్రస్తుతం మా సినిమా ద్వారా తెలుగులో పరిచయమవుతుంది. ఆ అమ్మాయి సీనియర్‌ నటుడు అమర్‌నాథ్‌ మనవరాలు. అలాగే నటుడు రాజేష్‌ కుమార్తె. నేను ఈ సినిమాను మొదటి సారిగా తమిళ్‌లో చూసి స్టన్‌ అయ్యాను ఎందుకంటే రెండున్నర గంటలపాటు ఆ సినిమాను ఆమె తన భుజాలపై మోసింది. ఆ వారం ఐదు పెద్ద సినిమాలు రిలీజ్‌ అయినా కూడా అన్ని సినిమాల్లో ఈ సినిమానే గొప్పది అనిపించింది. ఇప్పటికీ ఆ పిక్చర్‌లో నటించిన నటులకు. టెక్నీషియన్స్‌కి సన్మానాలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. తమిళంలో శివ కార్తికేయన్‌ కూతురు పాడిన పాట 130 మిలియన్స్‌ వ్యూస్‌ సాధించింది. తెలుగులో కూడా ఆ పాట మంచి హిట్‌ అయింది. అంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమాను ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని, అలాగే తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ని తెలుగులో పరిచయం చేయాలనీ ఈ సినిమా రైట్స్‌ తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఒక మంచి సినిమాకు భీమనేనిగారైతే పూర్తి న్యాయం చేయగలరని ఆయన్నే దర్శకుడిగా తీసుకున్నాం. సినిమాలో ఏ చిన్న పొరపాటు కూడా ఉండకూడదని ఆయన పడిన తాపత్రయానికి ఆయన్ను అభినందిస్తున్నాను. అలాగే ఒక కొత్త యువకుడైన హనుమాన్‌ చౌదరి చాలా బాగా మాటలు రాశాడు. రేపు సినిమా విడుదలయ్యాక అతన్ని అందరూ ప్రశంసిస్తారు. ఆగష్టు 18న గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా మీ అందర్నీ ఆకట్టుకుంటుంది” అన్నారు.

నిర్మాత కె.ఎ.వల్లభ మాట్లాడుతూ ”క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఈ సినిమా తమిళ్‌లో చాలా పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులో అంతకుమించిన విజయం సాధిస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం” అన్నారు.

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”రేపటి నుండి ఈ సినిమాకు సంబందించిన పబ్లిసిటీ, ప్రమోషన్స్‌ స్టార్ట్‌ అవుతాయి. ఇప్పటి వరకూ విడుదల అయిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే సాంగ్స్‌ మిలియన్స్‌ వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా మీద ఆడియన్స్‌కి పాజిటివ్‌ బజ్‌ ఉందని తెలుస్తోంది. మా ప్రొడ్యూసర్‌ గారు చెప్పినట్టు కౌసల్య క ష్ణమూర్తి డెఫినెట్‌గా ఒక మంచి సినిమా అవుతుంది. సినిమా ఔట్‌ ఫుట్‌ చాలా బాగుంది. మా కుటుంబ సభ్యులు కొంతమంది ఈ సినిమాను చూశారు. సినిమా టెక్నికల్‌గా కూడా చాలా బాగా వచ్చింది. రీమేక్‌ సినిమా అయినా ఒక స్ట్రెయిట్‌ సినిమా కన్నా ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టి చేశాం. నిర్మాత రామారావుగారు చాలా మంచి ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ని ఇచ్చారు. ఇప్పటి తరానికి తగినట్లు తన ఆలోచనలను మార్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన. మా టీమ్‌ అందరం మంచి డెడికేషన్‌తో సినిమా తెరకెక్కించాం. మీ అందరి సపోర్ట్‌ మాకు కావాలి. డెఫినెట్‌గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

మాటల రచయిత హనుమాన్‌ చౌదరి మాట్లాడుతూ – ”నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారికి థాంక్స్‌. దర్శకుడు భీమనేనిగారితో నేను ‘సుడిగాడు’ సినిమాకు వర్క్‌ చేయడం జరిగింది. నేను ‘కె.జి.ఎఫ్‌’ తరువాత మాటలు రాసిన సినిమా ఇది. ఒక అద్భుతమైన కథతో ఈ సినిమా రూపొందింది. డెఫినెట్‌గా ఈ సినిమా ఘనవిజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Kousalya Krishnamurthy Cricketer
  • #Rajender Prasad
  • #siva karthikeyan

Also Read

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’… రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’… రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

related news

Parashakti: అందరూ మిస్‌ చేసుకున్నారు అనుకున్నారు.. కానీ వాళ్లే సేఫ్‌ అయ్యారు

Parashakti: అందరూ మిస్‌ చేసుకున్నారు అనుకున్నారు.. కానీ వాళ్లే సేఫ్‌ అయ్యారు

Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

trending news

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

13 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

17 hours ago
Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

17 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

23 hours ago
Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

23 hours ago

latest news

Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

16 hours ago
Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

16 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రిపబ్లిక్ హాలిడే రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి బాగా కలిసొచ్చింది

Mana ShankaraVaraprasad Garu Collections: రిపబ్లిక్ హాలిడే రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి బాగా కలిసొచ్చింది

17 hours ago
Rajinikanth : రజిని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పిన కుమార్తె సౌందర్య

Rajinikanth : రజిని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పిన కుమార్తె సౌందర్య

17 hours ago
Nagarjuna : కింగ్ 100 లో టబు నటిస్తోందా..? నాగార్జున సమాధానం ఏంటంటే..?

Nagarjuna : కింగ్ 100 లో టబు నటిస్తోందా..? నాగార్జున సమాధానం ఏంటంటే..?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version