సోలో హీరోగా కెరీర్‌ను ప్రారంభించిన రానా.. ఆ తర్వాత వేరే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక్కసారి ఈ పని స్టార్ట్ చేశాక.. అలాంటి పాత్రలు వరుసగా రావడం ప్రారంభించాయి. దీంతో రానా సోలో హీరోగా వచ్చే సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఒకటి, రెండు వచ్చినా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో రానా సోలో హీరో కెరీర్‌పై తండ్రి సురేశ్‌బాబు దృష్టి పెట్టారు. అందుకే ఎవరెవరి దగ్గరికో వెళ్లిన ఓ సినిమాను తిరిగి కొడుకు దగ్గరకు తీసుకొచ్చారని అంటున్నారు.
శింబు కథానాయకుడిగా తమిళంలో వచ్చిన సినిమా ‘మానాడు’. శింబు కెరీర్ రీస్టార్ట్‌కి ఈ సినిమా బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. టైం లూప్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని వెంకట్ ప్రభు థ్రిల్ చేశారు. ఈ సినిమా రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ కైవసం చేసుకుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్‌లో స్టార్ హీరోతో తీయాలని అనుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. చాలామంది పేర్లు వినిపించాయి కూడా. నాగచైతన్య లాంటి కుర్ర హీరోను కూడా అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ సినిమాను రానాతోనే తీయాలని ఫిక్స్ అయ్యారట సురేశ్‌బాబు. నిజానికి ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకులు/రచయితలు అయిన హరీష్ శంకర్, దశరథ్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే సినిమాను డైరెక్ట్ చేసేది వాళ్లిద్దరూ కాదని సమాచారం. ఈ సినిమా కోసం టిపికల్, స్టైలిష్ కథలను డీల్ చేసే అనుభవం ఉన్న దర్శకుడి కోసం చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరో కాకుండా కీలకమైన పాత్ర.. తమిళంలో ఎస్.జె.సూర్య చేసిన పోలీసు పాత్ర. ఆ పాత్ర టిపికల్ క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్‌తో ఉంటుంది. దీని కోసం తెలుగులో ఎవరు ముందుకొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో వచ్చిన వార్తల ప్రకారం చేస్తే.. ‘మానాడు’లో అవకాశం వచ్చినప్పుడు రవితేజ నో చెప్పారట. అయితే ఆ సినిమా తెలుగులో వస్తే తాను చేస్తా అని అన్నారట. మరిప్పుడు రానా కోసం రవితేజ ఆ పాత్ర చేస్తారా? లేక వేరే ఎవరినైనా తీసుకుంటారా అనేది చూడాలి.