మాధవీలత.. ఈమె గురించి తెలియని వారు పెద్దగా ఉండకపోవచ్చు. అలా అని ఈమె పెద్ద హీరోయిన్ ఏమీ కాదు. అయినప్పటికీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మహేష్ బాబు ‘అతిధి’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించిన ఈ బ్యూటీ అటు తరువాత.. ‘నచ్చావులే’ ‘స్నేహితుడా’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు పర్వాలేదనిపించినా ఈమెకు వరుస అవకాశాలు అయితే ఏమీ రాలేదు. అయితే తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుండీ పోటీ చేసింది కానీ గెలవలేదు. ఇదిలా ఉండగా.. ఈమె పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్. అయినప్పటికీ ‘జనసేన’ పార్టీలో కాకుండా ‘బి.జె.పి’ పార్టీలో చేరడం ఏంటనే చాలా మంది ఈమెను ప్రశ్నిస్తున్నారట. దానికి ఈమె ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పుకొచ్చింది.
మాధవీలత మాట్లాడుతూ… “బీజేపీ అనేది జాతీయ పార్టీ. భవిష‌్యత్తులో నా కెరీర్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేరాను. ‘నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కాబట్టి జనసేనలో ఎందుకు చేరలేదని’ చాలా మంది అడిగారు. మరికొంతమంది అయితే బీజేపీలో చేరింది పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకునే అని కూడా కామెంట్స్ చేశారు. కామన్ సెన్స్ కొంచెమైనా ఉంటే అలా మాట్లాడరు. బీజేపీలో నేను చేరే సమయంలో జనసేనకు బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు లేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానిని.. సీటు ఇవ్వండి.. అంటే ఇస్తారా? ఇక నేను బీజేపీలో చేరినప్పుడు.. పవన్ మా పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుణ్ణు అనుకున్నాను. అనుకున్నట్టుగానే బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయి. నేను బీజేపీలో ఉన్నందుకు జనసైనికులు కూడా హ్యాపీగా ఫీలవ్వాలి” అంటూ చెప్పుకొచ్చింది.