Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » మహర్షి చిత్రం 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది: దిల్‌ రాజు

మహర్షి చిత్రం 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది: దిల్‌ రాజు

  • May 31, 2019 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహర్షి చిత్రం 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది: దిల్‌ రాజు

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా అందించిన ‘మహర్షి’ ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌గా అఖండ ప్రజాదరణ పొందుతూ.. 100 కోట్ల షేర్‌ క్రాస్‌ చేసి ఇప్పటికీ సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా…

సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ – ”మహర్షి’ చిత్రం మూడోవారం పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా నాలుగోవారంలోకి ఎంటర్‌ అయ్యింది. ఇప్పటికే 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది. నేను ఫస్ట్‌టైమ్‌ ఇంకో రెండు పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌తో కలిసి పని చేయడానికి కారణం వంశీ కథ చెప్పినప్పుడు ఆ కథ ఇచ్చిన ఎగ్జయిట్‌మెంట్‌. అదే నమ్మకంతో ఈ సినిమా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఒక సినిమా విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆ సినిమా విజయవంతమైతే వచ్చే కిక్కే వేరు. అదే ‘మహర్షి’ ప్రూవ్‌ చేసింది. కొన్ని సినిమాలు డబ్బుతో పాటు మంచి పేరుని కూడా తెస్తాయి. అలాంటి చిత్రం ‘మహర్షి’. ఎక్కడికెళ్ళినా మంచి ఎప్రిషియేషన్‌ వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రైతులతో కలిసినప్పుడు ఈ సినిమా తర్వాత రైతుల గురించి, వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారని వారు చెప్పడంతో వచ్చిన శాటిస్‌ఫ్యాక్షన్‌కి ఎంత డబ్బు వచ్చినా రాదు. మా బ్రదర్‌ మాట్లాడుతూ ఈ బేనర్‌లో ది బెస్ట్‌ మూవీ ఇదే వంశీ అన్నారు. మహేష్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ షేర్‌ సాధించిన సినిమాగా ‘మహర్షి’ నిలిచింది. అలాగే నైజాంలో కూడా ఇంకో రెండు, మూడు రోజుల్లో 30 కోట్ల షేర్‌ను టచ్‌ చేయబోతున్నాం. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘ఎఫ్‌2’తో పెద్ద హిట్‌ కొట్టాం.

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇప్పుడు సమ్మర్‌లో ‘మహర్షి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించాం. ఈ రెండు సక్సెస్‌లు ఇచ్చిన కిక్‌తో ఇంకో మూడు ప్రొడక్షన్స్‌తో రాబోతున్నాం. వంశీతో మా బేనర్‌లో ‘బృందావనం’, ‘ఎవడు’, ‘మహర్షి’లాంటి మూడు సూపర్‌హిట్‌ మూవీస్‌ చేశాం. త్వరలోనే మళ్ళీ వంశీతో మరో సూపర్‌హిట్‌కి రెడీ అవుతున్నాం. సబ్జెక్ట్‌ రెడీ అయ్యింది. కలెక్షన్స్‌తో పాటు అందరి అప్రిషియేషన్‌ కూడా పొందే విధంగా ఆ సినిమా ఉంటుంది” అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ”భారతదేశ రాజకీయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌గారు, నేను స్కూల్‌మేట్స్‌. ఇద్దరం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాం. ఆయన మాకు సీనియర్‌. స్కూల్‌లో రెడ్‌ హౌజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించేవారు. అప్పటి నుండే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మా ‘మహర్షి’ టీమ్‌ తరపున వారిద్దరికీ శుభాకాంక్షలు.

‘మహర్షి’ నేనెప్పుడూ చూడనంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌తో పాటు మహేష్‌బాబు కెరీర్‌లోనే ల్యాండ్‌ మార్క్‌ మూవీగా నిలిచింది. ఏ నమ్మకంతో అయితే సినిమా స్టార్ట్‌ చేశామో ఈరోజు ఆ నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా విజయంతో పాటు మాకిచ్చిన రెస్పెక్ట్‌ మా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎక్కడికెళ్ళినా రైతులు తమ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మాకు ఒక గుర్తింపునిచ్చారన్నా అంటున్నారు. మాకెలా స్పందించాలో తెలియలేదు. ఈ సినిమా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. రైతులను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. సొసైటీలో ఇది ఇంత ఇంపాక్ట్‌నిచ్చి అంతమందిని ఇన్‌స్పైర్‌ చేసే సినిమా అయినందుకు మా టీమ్‌ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ విజయం వెనుక మా టీమ్‌ కృషి ఎంతో ఉంది. నాలుగోవారంలోకి వచ్చినా కూడా ఈ సినిమా గురించి మాకు ఫోన్లు వస్తున్నాయి. ఈ సినిమాను అభినందించిన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఇండస్ట్రీ ప్రముఖులకు మా టీమ్‌ అందరి తరపున ధన్యవాదాలు. కొన్ని కొన్ని సినిమాలు మన జీవితాల్లో తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమానే ‘మహర్షి’. ఈ సినిమాకి ఇంతటి కలెక్షన్స్‌ ఇచ్చి, అంతకంటే మంచి రెస్పెక్ట్‌ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ రెస్పెక్ట్‌ని మా నెక్స్‌ట్‌ మూవీకి కాపాడుకుంటాం. అలాగే ఈ సినిమా చూసి సూర్యగారు ఒక మెమొరబుల్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. నన్ను అడ్మైర్‌ చేసిన యాక్టర్స్‌లో ఒకరు. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. ‘వంశీ.. ఒక 20, 25 ఇయర్స్‌ వరకు మనం ఒక సొసైటీ నేర్పిందో లేదా ఒక స్కూల్‌ నేర్పిందో, పేరెంట్స్‌ నేర్పిందో పట్టుకొని వెళ్తుంటాం. కానీ మీ సినిమా ద్వారా 20, 25 సంవత్సరాల్లో నేర్చుకోని ఒక థాట్‌ను ప్రొవోక్‌ చేశారు. మీరు రాసిన కథ, మహేష్‌గారు చూపించిన గట్స్‌, సోషల్‌ మెసేజ్‌ కానీ అమేజింగ్‌’ అన్నారు. 175 రోజులు మహేష్‌గారితో ట్రావెల్‌ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రిలీజయ్యాక 21 రోజులు ఆయనతో ఇంకా అన్యూన్యంగా గడిపే సమయం లభించింది. ఫస్ట్‌ నుండి మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. మాకు, ప్రేక్షకులకు మీరే వారథి. హాలిడే ట్రిప్‌కి యూరప్‌ వెళుతున్నాను. వచ్చాక మా నెక్స్‌ట్‌ సినిమా వివరాలు తెలియజేస్తాం” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Ananya
  • #devi sri prasad
  • #Maharshi
  • #Maharshi Collections

Also Read

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

trending news

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

5 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

5 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

5 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

5 hours ago
Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

5 hours ago

latest news

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

6 hours ago
Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

6 hours ago
Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

6 hours ago
Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

6 hours ago
Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version