సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద స్టార్ గానే చాలా మందికి తెలుసు. కానీ ఆయనలోని మానవతా కోణం తెలిసింది కొందరికే. అందుకు కారణం ఆయన మిగతా హీరోల వలే చేసిన సాయాన్ని పేరు, పుబ్లిసిటీ కోసం ఉపయోగించుకోరు. చేసిన సాయం ఆ చేతికి తప్ప మరో చెవిన పడకూడకు అనుకుంటారు. టాప్ స్టార్ గా ఏడాదికి వందల కోట్ల సంపాదన మహేష్ సొంతం. అలాగే ఆయన సొంతగా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ఆ సంపాదనలో కొంత సొమ్ము మహేష్ ఎప్పుడూ సామాజిక సేవకు ఉపయోగిస్తారు. మహేష్ ఎప్పటి నుండో గుండె జబ్బుతో బాధపడుతున్న పసిపిల్లకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. వారి వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చులను స్వయంగా భరిస్తున్నారు. ఈ విషయం చాలా కాలం ఎవరికీ తెలియదు. మహేష్ కానీ, ఆయన టీమ్ కానీ ఈ సేవాకార్యక్రమం గురించి బయటపెట్టలేదు. ఐతే అది ఆనోటాఈనోటా మీడియా వరకు చేరి బయటపడింది.
తాజాగా మహేష్ చిన్నపిల్లలకు చేయించిన ఆపరేషన్స్ సంఖ్య 1010 కి చేరింది. వెయ్యికి పైగా పసి హృదయాలకు మహేష్ మంచి మనసుతో ప్రాణం పోశారు. అలాగే మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకొని మౌళిక సదుపాయాలు సమకూర్చుతున్నారు. ఏమైనా మహేష్ గ్రేట్ కదా. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.