రాజమౌళి మహేష్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు అని 1500 కోట్లు అని వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాను కేఎల్ నారాయణతో పాటు మరి కొందరు నిర్మాతలు నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం కేఎల్ నారాయణ మాత్రమే ఈ సినిమా కోసం భారీ రిస్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు మహేష్ బాబు మూడేళ్ల పాటు డేట్లు కేటాయించారని తెలుస్తోంది.
తాజాగా తెలుస్తున్న వివరాల ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా పని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు పారితోషికం బదులుగా మహేష్ వాటా తీసుకునే ఛాన్స్ అయితే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వాటా తీసుకుంటే మహేష్ కు కనీసం 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయలు దక్కే ఛాన్స్ ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తానని భావిస్తున్నారు. మహేష్ బాబుకు ఇప్పటికే ఇతర భాషల్లో మంచి గుర్తింపు రాగా ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు దక్కనుంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
తారక్, చరణ్, ప్రభాస్ లతో ఎక్కువ సినిమాలు తీసిన రాజమౌళి వేగంగా సినిమాలను తెరకెక్కించాలని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి చివరి ప్రాజెక్ట్ గా మహాభారతం సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. (Mahesh Babu) మహేష్ జక్కన్న కాంబో మూవీ రిలీజ్ డేట్ గురించి, ఇతర విషయాల గురించి క్లారిటీ రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.