‘పెళ్ళి చూపులు’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించి ‘నేషనల్ అవార్డు’ తెప్పించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇక ఇదే ఉంత్సాహంతో ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి డీసెంట్ హిట్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోగా కూడా ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా తరుణ్.. ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ ని కలిసి ఓ కథ వినిపించాడట. యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి మహేష్ ఇప్పుడు ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో ఓ చిత్రాన్ని లైన్లో పెట్టాడు… అలాగే ‘ఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అనిల్ రావిపూడి తో కూడా ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.. స్వయంగా మహేషే ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇదే క్రమంలో తరుణ్ భాస్కర్ కూడా చేరాడు.
అయితే స్టోరీ లైన్ విన్న మహేష్ సానుకూలంగా స్పందించినప్పటికీ… తన ఇమేజ్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని సూచించాడట. కథే హీరో అన్న రీతిలో తరుణ్ భాస్కర్ అల్లుకుంటూ పోయాడని, అయితే భారీ బడ్జెట్ తో తీసే చిత్రాలకి … అన్ని విషయాల పై దృష్టి పెట్టాలని… అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాడట. ఇదివరకు లాగా మహేష్ ఒక లైన్ విని కాకుండా.. పూర్తి స్క్రిప్ట్ విన్నాకే పక్కాగా ప్లాన్ చేసుకుని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు.
‘భరత్ అనే నేను’ చిత్రంతో మహేష్ ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాడు. సుకుమార్ స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికే దాదాపు 8 నెలలు తిప్పించాడు. ఇక తరుణ్ భాస్కర్ సినిమాని ఓకే చేయాలంటే… ఈ డైరెక్టర్ చాలా వర్కౌట్లు చేయాలి. దాంతో ఇప్పుడు తరుణ్ భాస్కర్ అదే పనిలో ఉన్నాడట. తమ టీమ్ తో కూర్చుని స్క్రిప్టులో సోల్ చెడకుండా మార్పులు..చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.