సాంగ్స్ కోసం విదేశాలకు వెళ్లనున్న మహేష్ బాబు
- January 16, 2017 / 12:14 PM ISTByFilmy Focus
తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వందకోట్ల బడ్జట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రిన్స్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పటికీ 80 శాతం కంప్లీట్ చేసిన మురుగదాస్ బృందం ప్రస్తుతం హైదరాబాద్ లోని అమీర్ పేటలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తోంది. జనవరి 10 నుంచి మొదలైన ఈ షెడ్యూల్ ఈ నెలాఖరుకి పూర్తి అవుతుందని సమాచారం. ఫిబ్రవరి నుంచి ఈ చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్లనుంది.
అక్కడ అందమైన లొకేషన్లలో మహేష్, ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లపై రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరించనున్నారు. దీంతో 95 శాతం షూటింగ్ పూర్తి అవుతుందని, మిగిలిన కొన్ని సీన్ల కోసం పూణే వెళుతామని నిర్మాత ఠాగూర్ మధు వెల్లడించారు. తమిళ డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంభవామి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈనెల 26 న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















