మలయాళ నటులు భారతీయ సినిమా మొత్తానికే ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. టాలీవుడ్‌లో చాలా మంది టాప్ స్టార్లు (Heroes) పెద్ద పెద్ద పాన్-ఇండియా ప్రాజెక్టులపైనే కన్నేసి కూర్చుంటే, మలయాళ నటులు మాత్రం ఫుల్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ, అదిరిపోయే కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.టాలీవుడ్ టాప్ హీరోలు (Heroes) ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక్క సినిమాతోనే సరిపెడుతున్నారు. మహేష్ (Mahesh Babu) , ఎన్టీఆర్(Jr NTR),, చరణ్(Ram Charan),, బన్నీ (Allu Arjun) లాంటి స్టార్లు సెలెక్టివ్‌గా ఉంటున్నారు. రాబోయే 2 ఏళ్ళలో వీళ్ల నుంచి ఒక్క సినిమా వస్తేనే గొప్ప అన్నట్టుంది పరిస్థితి.
పైగా వీళ్లు తీసుకునే రెమ్యూనరేషన్లు కూడా భారీగా ఉండటంతో, నిర్మాతలు వాళ్లతో ఎక్కువ సినిమాలు ప్లాన్ చేయడానికి తంటాలు పడుతున్నారు. అందరిలోనూ ఒక్క ప్రభాస్ (Prabhas) మాత్రమే కాస్త ఎక్కువ సినిమాలతో లైన్‌లో ఉన్నాడు. ఇండస్ట్రీ బండి నడవాలంటే సినిమాలు కావాలి కదా…! కానీ మన స్టార్లను మరిన్ని ప్రాజెక్టులకు ఒప్పించడానికి నిర్మాతలు నానా కష్టాలు పడుతున్నారు.మలయాళ సూపర్ స్టార్లు మాత్రం వాళ్లు ఏడాదికి 3-4 సినిమాలు ఈజీగా లాగించేస్తున్నారు. సినిమాలు చేయడమే కాదు, భారీ హిట్లు కూడా కొడుతున్నారు.
మోహన్‌లాల్ (Mohanlal) కేవలం రెండు నెలల వ్యవధిలోనే ‘L2: ఎంపురాన్’ (L2 Empuraan), ‘తుడరుమ్’ (Thudarum) అనే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చాడు. రెండూ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపాయి. మమ్ముట్టి (Mammootty) గత రెండేళ్లలో ‘క్రిస్టఫర్’ ‘కన్నూర్ స్క్వాడ్’ ‘భ్రమయుగం’ (Bramayugam) ‘టర్బో’ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించారు. ఇతర మలయాళ నటులైన పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), జోజు జార్జ్ (Joju George), కుంచాకో బోబన్, నివిన్ పౌలీ (Nivin Pauly)… వీళ్లంతా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మంచి కథలు, కంట్రోల్డ్ బడ్జెట్లు, టైమ్‌కి రిలీజ్‌లు… ఇదే వాళ్ల మంత్రం.