వేసవి కాలంలో ఎండల వేడిమితో పాటు.. నీటిసమస్య కూడా ప్రజలను ఎంతగానో వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని.. మలయాళీ నటుడు ముమ్మట్టి పిలుపు నిచ్చారు. కొచ్చి లోని స్థానిక ప్రజలతో కలిసి ‘ఒన్ యువర్ వాటర్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం పైన ఆధార పడకుండా స్వతహాగా నీటిసమస్యను అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా వర్షపు నీటిని ఆదా చేసుకొనేలా.. ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా జిల్లా అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు కొచ్చిలో మంచి నీటి కేంద్రాలను ముమ్మట్టి ప్రారంభించగా.. త్వరలోనే కేరళలోని అన్ని జిల్లాలకు వీటిని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.