మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా, పలు రియాలిటీ షోలకు హోస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే తాజాగా మంచు లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. తన కూతురు విద్యా నిర్వాణను స్కూల్ కు పంపించాల్సి రావడంతో ఆమె ఎంతగానో బాధ పడ్డారు. కూతురిని స్కూల్ కు పంపించడం చాలా కష్టంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం మంచు లక్ష్మి కూతురును స్కూల్ లో దింపారు.
ఆ తర్వాత మంచు లక్ష్మి తన సోషల్ మీడియా స్టోరీలో ఒక వీడియోను షేర్ చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లాక్ డౌన్ వల్ల పాఠశాలలు మూసేసిన సమయంలో పిల్లలు ఇంటికే పరిమితమయ్యారని మంచు లక్ష్మి కామెంట్లు చేశారు. ఆ సమయంలో 24 గంటలు విద్యా నిర్వాణను ఎలా తట్టుకోవాలని తాను అనుకున్నానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. గత రెండేళ్ల నుంచి కూతురు ఇంట్లోనే ఉండటంతో కూతురికి తనకు మధ్య ప్రేమానుబంధం పెరిగిందని మంచు లక్ష్మి అన్నారు.
రెండేళ్ల తర్వాత కూతురును స్కూల్ కు పంపుతుంటే ఏదో తెలియని బాధ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. కూతురికి దూరంగా ఉండటం ఇంత కష్టంగా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదని ఆమె తెలిపారు. త్వరలోనే నేను దీనికి అలవాటు పడతానని అనుకుంటున్నానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో మంచు లక్ష్మి కూతురితో కలిసి చేసిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
మరోవైపు మంచు లక్ష్మిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంచు లక్ష్మి స్కూళ్లను దత్తత తీసుకోవడంపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయనే సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి సినిమాల విషయంలో వేగం తగ్గించడం గమనార్హం. మంచు లక్ష్మీ వరుస సినిమాలతో బిజీ కావాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.