Manchu Manoj,Jagan: ఎపి సీఎంను కలిసిన మంచు మనోజ్!
- September 6, 2021 / 06:40 PM ISTByFilmy Focus
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవాలని అనుకుంటున్నారు. అయితే వారు కలవాలి ఎంత ప్రయత్నం చేసినా కూడా సీఎంకు సమయం కుదరడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సురేష్ బాబు వంటి ప్రముఖులు కూడా చాలా కాలంగా జగన్ మోహన్ రెడ్డి తో సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చించాలని అనుకున్నారు. గత కొన్ని రోజులుగా వారు మీటింగ్ వాయిదా పడుతూనే ఉంది.
అయితే హఠాత్తుగా హీరో మంచు మనోజ్ మాత్రం పెద్దగా కష్టం లేకుండానే వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు కలిశారు అనే విషయంలో పెద్ద అనుమానం రాకుండా మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జగన్ చేస్తున్న మంచి పనుల పై ఆసక్తితోనే స్నేహపూర్వకంగా కలిసినట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా జగన్ తో దిగిన ఫోటోలను కూడా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు.

ఎంతో ముందు చూపు కలిగిన ఏపి ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్తు తరాల కోసం ఆయన చేయబోతున్న పనుల గురించి ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఆయన ప్రణాళికలు ఎంతగానో ఆకర్షించాయని చెబుతూ… ఆయన అనుకున్న అన్ని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నా.. అంటూ మనోజ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!












