కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఓపక్క వ్యాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూప్ గందరగోళం నడుస్తుండగా.. మరోపక్క ప్రయివేట్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ డోసులను బ్లాక్ లో అమ్ముకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా నటి మీరాచోప్రా వ్యాక్సిన్ వేయించుకుంది. థానేలోని పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర డోస్ వేయించుకుంది. అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో ఈ పని చేసినట్లు తెలిసింది.
దీంతో బీజేపీ మీరాచోప్రాపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. ముందుగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన మీరాచోప్రా ఈ వివాదం మొదలవ్వగానే ఫోటోను డిలీట్ చేసింది. దీంతో అందరూ ఆమె ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకుందనే అనుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారులు కూడా ఆరోపణలు నిజమైతే ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాజాగా ఈ వివాదంపై మీరాచోప్రా స్పందించింది. తనపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.
వ్యాక్సిన్ వేయించుకునే సయమంలో వెరిఫికేషన్ కోసం కేవలం ఆధార్ కార్డు మాత్రమే చూపించానని చెప్పుకొచ్చింది. ఎవరో కావాలనే ఫోటోషాప్ చేసి ఈ వివాదానికి కారణమయ్యారంటూ కామెంట్స్ చేస్తోంది. మరి అధికారుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి!