మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలని నాగబాబు ఆశిస్తుండగా ఇప్పటివరకు ఆశాజనకంగా ఫలితాలు రాలేదు. అయితే 2024 ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి నాగబాబు పోటీ చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. మరి నాగబాబు ఇక్కడినుంచి పోటీ చేస్తారో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నాగబాబు కాకినాడ నుంచి పోటీ చూస్తే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల విషయంలో జనసేన ఎంతో కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కచ్చితంగా అనుకూల ఫలితాలు వచ్చేలా జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి మేలు చేయనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ పోటీ చేసే స్థానం గురించి కూడా త్వరలో క్లారిటీ రానుందని సమాచారం అందుతోంది. జనసేన పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనే ప్రశ్నలకు సైతం త్వరలో సమాధానం లభించనుందని తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. పవన్ త్వరలో ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రచారం చేసే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. పవన్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా రిలీజ్ డేట్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
ఈ మూడు సినిమాలు సక్సెస్ సాధించి పవన్ కళ్యాణ్ రేంజ్, మార్కెట్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవన్ సినిమాలన్నీ భారీ రేంజ్ లో తెరకెక్కుతుండగా పవన్ సినిమాలలో కొన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదల కానున్నాయి.