చిరంజీవి – నాగార్జున స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్న జరిగిన మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలకి చిరు- నాగ్ ఇద్దరూ కలిసి ఒకే కారులో వచ్చి ఓటు వేశారు. ఇది పెద్ద విషయం కాక పోయినా… రక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ కలిసి ఒకే కారులో రావడం…దారిలో వాళ్ళు ఏమేమి చర్చించుకున్నారు… అసలు వీరు ఎవరికి ఓటేసి ఉంటారు అనేది ప్రస్తుతం ఫిలింనగర్లో చర్చనీయాంశం అయ్యింది. ఇక ఈ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా జరగడం విశేషం.
శివాజీ రాజా వర్సెస్ నరేష్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఒకరి పనితీరు పై మరొకరు అసంతృప్తి వ్యక్తం చేయడం అందరిలోనూ ఈ ఎన్నికల పై ఆసక్తిని పెంచాయి.ఇక ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి – నాగార్జున ఒకే కార్లో రావడం అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ‘మాటీవీ’ వ్యవస్థాపకులుగా చిరు- నాగ్ కి ఉన్న సంబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మా’ పైన వీరేమైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారా. మా సొంత భవంతి నిర్మాణం కోసం వీరి ప్లాన్ ఏంటి. దీని పైన వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చర్చనీయాంశం అయ్యింది.మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి…!