టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. “లూసిఫర్” అనే మలయాళీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మోహనరాజా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో నటించగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు. ఇక సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది.
అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా ప్రేక్షకుల మందుకి వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ నటించినకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక దర్శకుడు మోహనరాజ టేకింగ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి దర్శకుడిగా మొదటగా మోహన రాజ స్థానంలో మరొక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని అనుకున్నట్లు సమాచారం.
మోహన్ రాజాకు బదులుగా ఈ సినిమాకి అనుకున్న డైరెక్టర్ మరెవరో కాదు.. క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సుకుమార్. లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచన మొదటిగా రామ్ చరణ్ కి వచ్చినప్పుడు సుకుమార్ ను సంప్రదించగా కొంచెం కథ మార్చి మెగాస్టార్ కి సరిగ్గా సూట్ అవుతుందని సుకుమార్ చెప్పినట్లు సమాచారం.
అందువల్ల ఈ సినిమాకి సుకుమార్ ని దర్శకుడిగా నియమించాలని మెగాస్టార్ భావించినప్పటికీ సుకుమార్ పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంవల్ల గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించటానికి కుదరలేదు. అందువల్ల ఈ సినిమా కోసం మోహన్‌రాజా ని సంప్రదించినట్లు తెలుస్తొంది. ఒకవేళ మోహన రాజాకి బదులు సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే ఈ సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.