కన్నడ మ్యూజిక్ డైరెక్టర్లకి కూడా టాలీవుడ్లో డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పటికే ‘ఖుషి’ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఆల్రెడీ తెలుగులో 2 సినిమాలు చేసేసాడు. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ సినిమా పాటలు కూడా మార్మోగుతున్నాయి. మరోపక్క అజనీష్ లోకనాథ్ కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇతను ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తెలుగులో అయితే ఆల్రెడీ ‘విరూపాక్ష’ చేశాడు అది పెద్ద హిట్ అయ్యింది.
ఈ మధ్యనే ‘మంగళవారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల్లో అజనీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రశంసల వర్షం కురిసింది అని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాలకి ఇతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అవసరం అని టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇదే మంచి ఛాన్స్ కదా అని.. పారితోషికం కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడట (Ajaneesh Loknath) అజనీష్.
‘విరూపాక్ష’ ‘మంగళవారం’ సినిమాలకి రూ.60 లక్షల వరకు పారితోషికం అందుకున్న ఇతను… నెక్స్ట్ సినిమాలకి కోటి, కోటిన్నర చెబుతున్నాడట. మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఇంత మొత్తం డిమాండ్ చేస్తుంది అంటూ లేదు. మరోపక్క అజనీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫుల్ మార్క్స్ వేయించుకుంటున్నప్పటికీ…, చార్ట్ బస్టర్ సాంగ్స్ అయితే ఇచ్చింది లేదు.
పాటల విషయంలో ఇతను పెద్దగా మెస్మరైజ్ చేసింది అంటూ ఏమీ లేదు. అలాంటప్పుడు అతను డిమాండ్ చేసిన పారితోషికానికి దర్శకనిర్మాతలు ఓకే చెబుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న