Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » థియేటర్లో నుంచి బయటకొచ్చినా.. సినిమాలో నుంచి బయటకి రాకూడదు

థియేటర్లో నుంచి బయటకొచ్చినా.. సినిమాలో నుంచి బయటకి రాకూడదు

  • May 7, 2018 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థియేటర్లో నుంచి బయటకొచ్చినా.. సినిమాలో నుంచి బయటకి రాకూడదు

“సావిత్రిగారి గురించి ఎవరికీ తెలియని విషయాలేమీ లేవు. ఆ విషయాలనే మళ్ళీ జనాలకి కొత్తగా కాకపోయినా ఆసక్తికరంగా చూపించాలి, రెండున్నర గంటల సినిమా చూసిన ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకి వచ్చేప్పుడు “మహానటి” అనుభూతులు వాళ్ళ మదిలో మెదులుతూ ఉండాలి. ఒక ఫిలిమ్ మేకర్ గా నాకు అంతకుమించిన కోరిక లేదు” అంటూ “మహానటి” సినిమా ద్వారా ఒక దర్శకుడిగా తాను ఏం సాధించాలనుకొంటున్నాడు, అసలు “మహానటి” మేకింగ్ వెనుక కష్టం ఏమిటి అనే విషయాలు ఈ బుధవారం సినిమా విడుదలను పురస్కరించుకొని పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..!!

ఆ ఆరు గంటల రేడియో షో విన్న తర్వాత..nag-ashwin-special-interview-about-mahanati-movie1

సావిత్రిగారి గురించి చిన్నప్పట్నుంచి తెలిసినా.. ఆమె గురించి చదివిన పుస్తకాలు, పేపర్ కటింగ్స్ వల్ల ఆమె సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. కానీ.. కిరణ్ ప్రభుగారు దాదాపు 6 గంటల సేపు సావిత్రి గారి గురించి చేసిన రేడియో షో విన్న తర్వాత మాత్రం సావిత్రిగారి మీద, ఆవిడ జీవితం మీద విపరీతమైన గౌరవం పెరిగింది. అప్పట్నుంచి ఆమె గురించి తెలుసుకుంటూ వచ్చాను. అలా ఆమె గురించి సినిమా తీయాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది.

రియల్ లైఫ్-రీల్ లైఫ్ మిక్స్..nag-ashwin-special-interview-about-mahanati-movie2

సావిత్రిగారి సినిమా అంటే కొన్ని సినిమాలు కాదు, కొన్ని సంఘటనలు కాదు.. ఒక జీవితం. ప్రేక్షకులకు ఆమె గురించి తెలియని ఎన్నో విశేషాలను, సంఘటనలను తెలియజేయాలనుకొన్నాను. ఒక పరిపూర్ణమైన చిత్రంగా “మహానటి”ని తీర్చిదిద్దడం కోసం చాలా కష్టపడ్డాను. సావిత్రిగారు మొదటిసారి ఏఎన్అర్ గారిని “బాలరాజు” షూటింగ్ సమయంలో కలుసుకోవడం మొదలుకొని.. నటిగా ఆమె ఎదుగుదల, వైవాహిక జీవితం, ఆస్తిపాసుల సంపాదన, ఆమె మరణం.. ఇలా సావిత్రి జీవితానికి సంబంధించిన అన్నీ అంశాలనూ కవర్ చేశాను.

నా పని కాస్త సులువైంది..nag-ashwin-special-interview-about-mahanati-movie3

నేను సావిత్రి గారి అన్నీ సినిమాలూ చూడలేదు, కుదరదు కూడా. అయితే.. కొందరు సీనియర్ రచయితలు, పాత్రికేయులు ఆమె జీవితం గురించి రాసిన పుస్తకాలు బాగా హెల్ప్ అయ్యాయి. నేను ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండాపోయింది. ఇక సావిత్రి గారి పిల్లలు ఇంకాస్త ఇన్ఫో ఇచ్చారు. సో, ఒక డైరెక్టర్ గా “మహానటి” కథ సిద్ధం చేసుకోవడానికి పెద్దగా ఇబ్బందిపడలేదు.

తర్వాత మళ్ళీ తీయలేనేమో అనిపించింది..nag-ashwin-special-interview-about-mahanati-movie4

“ఎవడే సుబ్రమణ్యం” తర్వాత అసలు మళ్ళీ ఏ సినిమా తీయాలి అనే క్లారిటీ లేకుండాపోయింది. ఇక “మహానటి” సినిమా తీయాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. “రెండో సినిమాతోనే ఇంత రిస్క్ ఎందుకు” అని ప్రశ్నించినవాళ్లూ ఉన్నారు. కానీ.. నావరకు ఒక దర్శకుడిగా నేను ఇంకా తొలి అడుగుల్లోనే ఉన్నాను. కాబట్టే ఒక ఫిలిమ్ మేకర్ గా హానెస్ట్ గా “మహానటి” చిత్రాన్ని తీయగలను అనిపించింది. అందుకే రెండో సినిమాకే ఇలా సాహసం చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంకో భయం ఏమిటంటే.. ఒక పెద్ద హిట్, లేదా పెద్ద ఫ్లాప్ తర్వాత ఈ సినిమా తీయలేనేమో అన్న భయం.

ఫ్లో మాత్రం మిస్ అవ్వదు..nag-ashwin-special-interview-about-mahanati-movie5

నిజానికి సావిత్రిగారి గురించి నేను కలెక్ట్ చేసిన ఇన్ఫోతో అమెజాన్ సిరీస్ ఒకటి ప్లాన్ చేయొచ్చు. కానీ.. ఎక్కువ సన్నివేశాలతో, ఎక్కువ పాత్రలతో ఉండడం వలన లెంగ్త్ ఎక్కువైంది అనిపించింది కానీ.. ఎక్కడా ఫ్లో మిస్ అవ్వకుండా సినిమాని తెరకెక్కించానని నమ్ముతున్నాను. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ డిసైడ్ చేయాలి.

కీర్తి విషయంలో రిస్క్ తీసుకున్నాను..nag-ashwin-special-interview-about-mahanati-movie6

తమిళంలో “తొడరీ” (తెలుగులో “రైల్”) సినిమా చూసినప్పుడు సావిత్రిగారి యంగ్ ఏజ్ కి ఈ అమ్మాయి సరిగ్గా సూట్ అవుతుంది అనిపించింది. అలాగే.. ఆమె విషయంలో భయం కూడా ఉండింది ఏమిటంటే.. అప్పటివరకూ ఆ అమ్మాయి చేసినవన్నీ కమర్షియల్ హీరోయిన్ రోల్సే. సో, ఒక నటిగా ఆమె ప్రూవ్ చేసుకొన్నదేమీ లేదు. అయితే.. నా మనసు చెబుతున్నదేమిటంటే.. “ఈ అమ్మాయి న్యాయం చేయగలదు”అని. సో, గుడ్డిగా నా మనసు మాట విని కీర్తి సురేష్ తో రిస్క్ చేశాను. లక్కీగా కీర్తి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతంగా నటించింది. ఈ సినిమా చూసిన తర్వాత కీర్తి మీద మన దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది.

వాళ్ళందరూ సావిత్రి గారి కోసం చేశారు..nag-ashwin-special-interview-about-mahanati-movie7

ఈ సినిమాలో మోహన్ బాబు గారు, నాగచైతన్య క్రిష్, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ వంటివాళ్ళందరూ నన్ను చూసో లేక వైజయంతీ మూవీస్ బ్యానర్ కోసమే ఈ సినిమాలో నటించలేదు. కేవలం సావిత్రిగారి మీద ఉన్న అభిమానం, ప్రేమతోనే ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు తప్పితే, ఇంకో కారణమేమీ లేదు.

ట్రైలర్ అవసరం లేదనిపించింది..nag-ashwin-special-interview-about-mahanati-movie1

సింపుల్ గా టీజర్ రిలీజ్ చేసి ఇంక వేరే ప్రోమోస్ కానీ ట్రైలర్ గానీ లేకుండా సినిమా రిలీజ్ చేయడం వెనుక ప్రత్యేకించి కారణం ఏమీ లేదు. ఎందుకంటే.. టీజర్ తోనే సినిమా కంటెంట్ ఏమిటి అనేది తెలియజెప్పాను. అందువల్ల మళ్ళీ ప్రత్యేకించి ట్రైలర్ రిలీజ్ చేయాలి అన్న ఆలోచన రాలేదు.

వైజయంతీ వారి సపోర్ట్ లేకపోతే “మహానటి”ని ఊహించలేను..nag-ashwin-special-interview-about-mahanati-movie2

కేవలం “వైజయంతీ మూవీస్’ బ్యానర్ లో నా భార్య ప్రియాంక సపోర్ట్ ఉంది కాబట్టే “మహానటి”ని ఇంత గ్రాండ్ స్కేల్ లో తీయగలిగాను తప్పితే.. వేరే ఏదైనా నిర్మాణ సంస్థలో అయితే ఈ స్థాయిలో తెరకెక్కించగలిగేవాడిని కాదేమో. స్వప్న దత్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేను.

ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్..nag-ashwin-special-interview-about-mahanati-movie7

“మహానటి” సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన పీరియాడిక్ ఎక్స్ పీరియన్స్ తప్ప ఏమీ ఆఫర్ చేయలేను. సావిత్రి గారి గురించి పలు విధాలుగా అందరికీ తెలిసిందే. అయితే.. ఆ విశేషాలన్నీ ఒకే తెరపై చూడాలంటే “మహానటి” చూడాల్సిందే.

– Dheeraj Babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salman
  • #keerthy suresh
  • #Mahanati Movie Promotions
  • #Malavika Nair
  • #Mohan Babu

Also Read

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

related news

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Vijay and Rana: ఆ హీరోలకు షాకిచ్చిన ఈడీ.. టాలీవుడ్‌ నటుల ఆస్తులు అటాచ్‌ అవుతాయా?

Vijay and Rana: ఆ హీరోలకు షాకిచ్చిన ఈడీ.. టాలీవుడ్‌ నటుల ఆస్తులు అటాచ్‌ అవుతాయా?

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా  రివ్యూ & రేటింగ్!

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా రివ్యూ & రేటింగ్!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

trending news

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

4 hours ago
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

4 hours ago
Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

6 hours ago
Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

7 hours ago

latest news

Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

1 hour ago
RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

4 hours ago
Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

5 hours ago
ఏందీ స్క్రీన్‌ల డిస్కషన్‌.. మన దగ్గర ఎన్ని రకాల స్క్రీన్‌లు ఉన్నాయి.. వాటి లెక్కేంటో తెలుసా?

ఏందీ స్క్రీన్‌ల డిస్కషన్‌.. మన దగ్గర ఎన్ని రకాల స్క్రీన్‌లు ఉన్నాయి.. వాటి లెక్కేంటో తెలుసా?

5 hours ago
Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌..  హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌.. హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version