అవును.. యంగ్ హీరో నాగశౌర్య తెలివితేటలు మాములుగా లేవు. ఓ ఆరాటపడిపోయి పెద్ద రేంజ్ లో సినిమాలు తీసేసి రాత్రికి రాత్రే.. స్టార్ హీరో అయిపోవాలని తహతహలాడిపోడు. సింపుల్ గా తనకు సెట్ అయ్యే సినిమాలనే చేస్తుంటాడు. అలాగని రొటీన్ కథలు మాత్రమే చేసి బోర్ కొట్టించడు. అందరి హీరోల అభిమానులకి ఈ కుర్ర హీరో సినిమాలంటే ఇష్టం. పొడుగ్గా ఎంతో అందంగా కనిపించే ఈ కుర్ర హీరోకి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇదిలా ఉంటే.. ‘ఓ బేబీ’ చిత్రం తర్వాత నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘‘అశ్వథ్థామ’’. రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 31న విడుదల కాబోతుంది.
ఈ చిత్రానికి హీరో నాగ శౌర్యనే కథ అందించడం విశేషం. తన స్నేహితుడి జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆధారం చేసుకుని ఈ కథ రెడీ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రం హిట్ అయితే మిగిలిన హీరోలకి కూడా ఈ కుర్ర హీరో కథలు అందిస్తాడట. అంతేకాదు తన హోమ్ బ్యానర్ అయిన ‘ఐరా క్రియేషన్స్’ పైనే ఆ సినిమాల్ని నిర్మిస్తానని చెబుతున్నాడు. సో ఈ చిత్రం హిట్ అయితే ఆయనకి రెండు రకాలుగా లాభం ఉంటుంది. ఇక ‘సాహో’ ‘రాక్షసుడు’ వంటి చిత్రాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన జిబ్రాన్… ‘‘అశ్వథ్థామ’’ చిత్రానికి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం మరో ఆకర్షించే అంశం అని చెప్పాలి.