మహేష్ బాబు టాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటన,మేనరిజమ్స్ తోనే స్టార్ హీరో ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. గత 5 సినిమాల నుండి చూసుకుంటే.. మహేష్ బాబు నటించిన ప్రతి సినిమా రూ.100 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేస్తుంది. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సర్కారు వారి పాట’ ఇప్పుడు ‘గుంటూరు కారం’..
ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించినవే..! ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా మహేష్ బాబుకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. డబ్బింగ్ వెర్షన్లతోనే ఆ సినిమాలు కోట్లల్లో వసూళ్లు సాధిస్తున్నాయి. మరోపక్క నార్త్ లో మహేష్ భార్య నమ్రతకి సర్కిల్ ఎక్కువగానే ఉంది.కావాలి అనుకుంటే మహేష్ సినిమాలను అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేయించే సమర్థురాలు.
అక్కడి మీడియాని కూడా హ్యాండిల్ చేయగలదు. కానీ మహేష్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. తాను నిర్మాతగా చేసిన ‘మేజర్’ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయించగలిగాడు కానీ తన సినిమాల విషయంలో అలాంటి స్టెప్ తీసుకోలేదు. ఈ విషయంపై తాజాగా ‘గుంటూరు కారం’ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ స్పందించారు.
‘గుంటూరు కారం’ ని పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు రిలీజ్ చేయలేదు అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘మహేష్ బాబు గారు తన పాన్ ఇండియా మార్కెట్ ను రాజమౌళి గారి సినిమాతోనే ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు. అందుకే ‘గుంటూరు కారం’ ని అలా ప్లాన్ చేయకుండా కేవలం తెలుగులోనే చేశాం’ అంటూ తెలియజేశాడు (Naga Vamsi) నాగ వంశీ.