సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన ‘వేట్టయన్’ (Vettaiyan) మూవీ ఈరోజు అనగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జై భీమ్’ తో తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న టి.జి.జ్ఞానవేల్ (T. J. Gnanavel) ఈ చిత్రానికి దర్శకుడు. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కంటెంట్ ను.. రజినీకాంత్ స్టార్ డంని.. దర్శకుడు మేనేజ్ చేసిన తీరు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh Ravichander) సైతం..
Vettaiyan
తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. మెయిన్ పాయింట్ కోసం దర్శకుడు ఎంపిక చేసుకున్న లేయర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ‘వేట్టయన్’ లో రజినీకాంత్ తో పాటు రానా (Rana) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) కూడా నటించారు. రానా పాత్ర క్లైమాక్స్ లో వస్తుంది. అయితే ఫహాద్ ఫాజిల్ పాత్ర… సీరియస్ గా వెళ్తున్న కథకి కామెడీతో కొంత రిలీఫ్ ఇచ్చే విధంగా ఉంటుంది.
క్లైమాక్స్ లో ఈ పాత్ర ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. వాస్తవానికి ఈ పాత్ర కోసం ఇద్దరు టాలీవుడ్ హీరోలను అనుకున్నారట. వాళ్ళు మరెవరో కాదు నాని (Nani), శర్వానంద్ (Sharwanand) . ముందుగా ఈ పాత్రని నానికి వినిపించగా.. అతను నో చెప్పాడట. తర్వాత శర్వానంద్ కూడా చేయలేను అని చెప్పినట్లు సమాచారం. వీళ్ళిద్దరిలో ఒకరు చేసినా.. తెలుగులో ఇంకా బెటర్ రీచ్ ఉండేదేమో. అయినప్పటికీ ఫహాద్ మాత్రం న్యాయం చేశాడనే చెప్పాలి.