వరుస విజయాలు వస్తున్నాయన్న గర్వామో లేక ఎన్నాళ్ళిలా యువ కథానాయకుడిగానే మిగిలిపోవాలన్న ఆలోచనో తెలియదు కానీ.. ఉన్నట్లుండి తన రెమ్యూనరేషన్ పెంచేశాడు నేచురల్ స్టార్ నాని. ‘ఎవడే సుబ్రమణ్యం’ మొదలుకొని గతేడాది విడుదలైన “మిడిల్ క్లాస్ అబ్బాయి” వరకూ ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడం, కొన్నిసార్లు రివ్యూ రైటర్లు సినిమా బాలేదని తేల్చి చెప్పేసినా.. జనాలు మాత్రం సినిమాని సూపర్ హిట్ చేసేవారు. ఆ విధంగా నాని పీపుల్ స్టార్ అయిపోయాడు.
ఇప్పుడు ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకే తన రెమ్యూనరేషన్ పెంచాడనిపిస్తోంది. “మిడిల్ క్లాస్ అబ్బాయి” వరకూ 6 కోట్ల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకొన్న నాని.. “కృష్ణార్జున యుద్ధం” నుంచి రెమ్యూనరేషన్ పెంచి ఇప్పుడు ఏకంగా 9 కోట్ల రూపాయలు చార్జ్ చేస్తున్నాడట. ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నాని కోరిక మేరకు 9 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సన్నద్ధమవ్వగా.. ఇప్పుడు మిగతా నిర్మాతల నుంచి కూడా నాని ఇదే విధంగా డిమాండ్ చేస్తున్నాడని వినికిడి. ఈ వార్త గనుక నిజమైతే.. నాని వద్దకు ఇకపై చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులు వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి.