Tuck Jagadish: టక్ జగదీష్ రిలీజ్ డేట్ ఫిక్సైందా..?
- June 15, 2021 / 06:55 PM ISTByFilmy Focus
కరోనా సెకండ్ వేవ్ వల్ల ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలలో కొన్ని సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నాని, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాను ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించగా థియేటర్లు మూతబడటంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. గత కొన్నిరోజుల నుంచి కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో టక్ జగదీష్ మేకర్స్ ఈ సినిమాను జులై నెల 30వ తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ఆ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమా షూటింగ్ పది రోజుల బ్యాలెన్స్ ఉండటంతో ఆ సినిమా రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రాధేశ్యామ్ సినిమా జులై 30వ తేదీన రిలీజైతే మాత్రం టక్ జగదీష్ ఆగష్టు 20వ తేదీన రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులో ఉన్నా టక్ జగదీష్ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మేకర్స్ నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. టక్ జగదీష్ రిలీజై భారీ కలెక్షన్లను సాధిస్తే అగ్ర హీరోలు సైతం తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. నాని ఈ సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలలో నటిస్తున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన నిన్నుకోరి, మజిలీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో టక్ జగదీష్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

















