‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.అనిరుధ్ సంగీతమందించిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న విడుదల కాబోతుంది. నాని గత రెండు చిత్రాలు ప్లాపవ్వడంతో ‘జెర్సీ’ చిత్రానికి పెద్ద బిజినెస్ ఏమీ జరగదనుకున్నారంతా. అయితే విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉండటం.. క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి తగినట్టుగానే మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.
‘జెర్సీ’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
వెస్ట్ – 1.25 కోట్లు
నెల్లూరు – 0.80 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 20.10 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 1.90 కోట్లు
ఓవర్సీస్ – 4.0 కోట్లు
————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 26 కోట్లు
————————————————–
ఓవరాల్ గా ‘జెర్సీ’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సాధారణంగా నాని మార్కెట్ బట్టి చూసుకుంటే ఇది పెద్ద కష్టం కాదు. కానీ ‘జెర్సీ’ విడుదలవుతున్న రోజునే లారెన్స్ ‘కాంచన3’ కూడా రిలీజవుతుంది. ఈ చిత్రానికి కూడా మంచి క్రేజ్ ఉంది. బి,సి సెంటర్స్ లో ‘కాంచన3’ ఎఫెక్ట్ ‘జెర్సీ’ చిత్రం పై పడే అవకాశం కచ్చితంగా ఉందనే చెప్పాలి. అయితే వచ్చే వారం కొత్త సినిమాలేమీ రిలీజ్ లేకపోవడం ‘జెర్సీ’ చిత్రానికి కలిసొచ్చే అంశం. మరి ఈ అవకాశాన్ని ‘జెర్సీ’ ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో… నాని ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి.