ఎన్టీఆర్ టీడీపీ కి దూరమయ్యి చాలా రోజులే అయ్యింది. గతేడాది తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. హరికృష్ణ కుమార్తె.. అలాగే సొంత అక్క అయిన సుహాసిని టీడీపీ నుండీ పోటీ చేసినా.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఏమాత్రం ప్రచారంలో పాల్గొనలేదు. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం ఇలాగే ప్రవర్తించారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ఇదే క్రమంలో ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస రావు కూడా వైసీపీ లో జాయినయిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ మళ్ళీ కలుస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా.. చంద్రబాబు… ఎన్టీఆర్ ను కలిశారు. విషయం ఏమిటంటే.. 2018లో (గత సంవత్సరం) ఆగష్టు 29న రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. అంటే ఈ ఆగష్టు 29 కి సరిగ్గా యేడాది పూర్తవుతుంది. అయితే తెలుగు పంచాగం ప్రకారం హరికృష్ణ పుణ్యతిథి ఈ ఆగష్టు 18నే కావడంతో.. చంద్రబాబు నాయుడు ..జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో హరికృష్ణ సంవత్సరీకానికి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా… ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్‌ను కూడా కలిసారు చంద్రబాబు. చాలా సేపు వీరి కుటుంబ విషయాల గురించి కూడా చర్చించుకున్నారని తెలుస్తుంది. దీంతో వీరి మధ్య ఉన్న గ్యాప్ కాస్త తగ్గినట్టే అని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారట.