నవీన్ పోలిశెట్టి.. కెరీర్ ప్రారంభంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘డి ఫర్ దోపిడి’ ‘వన్ నేనొక్కడినే’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. తర్వాత బాలీవుడ్లో కూడా ‘చిచోరే’ వంటి హిందీ సినిమాల్లో నటించి వచ్చాడు. కొన్నాళ్ళకి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారి ఓ సూపర్ హిట్ అందుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత ‘జాతి రత్నాలు’ తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నవీన్ పోలిశెట్టి లో ఉన్న ప్లస్ పాయింట్ అనుకోవచ్చు లేదా హైలెట్ పాయింట్ అనుకోవచ్చు..
అది అతని కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. కానీ అతను హీరోగా చేసిన సినిమాల్లో అది బ్యాక్ టు బ్యాక్ రిపీట్ అవుతుండటంతో .. నవీన్ ఇక ఒకే రూట్లో వెళ్తాడా అనే అనుమానాలు అందరిలో స్టార్ట్ అయ్యాయి.అందుకోసమే తన నెక్స్ట్ సినిమాల నుండి ఏమైనా సీరియస్ రోల్స్ చేస్తాడా? అనే ప్రశ్నలు కూడా ఊపందుకున్నాయి. మరోపక్క సీరియస్ రోల్స్ చేస్తేనే నేషనల్ అవార్డులు వంటివి వరిస్తాయి అనే వాదన చాలా కాలంగా అంది.
వీటికి నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘ అవార్డు వస్తుంది కదా అని నేను ఎంటర్టైన్మెంట్ లేని సినిమాల్లో నటించను. అలాంటి సినిమాలు చేస్తే జనాలకి కూడా నచ్చదు. ఎంటర్టైన్మెంట్ లేని సినిమాలు జనాలను ఆకర్షించడం కష్టం. నా లాంటి వాడి నుండి అది జనాలు ఆశించడం లేదు. అలాంటి సినిమాలు చేసి నష్టాలు తెప్పించడం నాకు ఇష్టం లేదు’ అంటూ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) చెప్పుకొచ్చాడు.