17 నిమిషాల ఫుటేజ్ ను రూ.50 టికెట్ పెట్టి ఎవరు చూస్తారు.. అని బాలయ్య ‘నర్తనశాల’ గురించి చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా బాలకృష్ణ త్రిపాత్రాభినయం వహించిన ‘నర్తనశాల’ ను పూర్తిగా సినిమా అని అనలేము కానీ ప్రమోషన్లను మాత్రం పెద్ద సినిమా స్థాయిలోనే చేశారు..!శ్రేయాస్ వాళ్ళు తమ ఎటిటిలో ‘పే పెర్ వ్యూ’ పద్దతిలో ‘నర్తనశాల’ ను విడుదల చేసారు. సౌందర్య , శ్రీహరి ల ఆఖరి చిత్రం వంటిది కాబట్టి..
దీని పై మంచి క్రేజే ఏర్పడింది. దాంతో రెండు రోజుల్లో ‘నర్తనశాల’ కు 1లక్ష 50వేల పైనే టికెట్లు బుక్ అయ్యాయని సమాచారం. అంటే 50 రూపాయల టికెట్ రేటు చొప్పున లెక్కేసుకుంటే 50 లక్షల పైనే రాబట్టిందని చెప్పొచ్చు. ఓ రకంగా ఇది పరిణామమనే చెప్పాలి. ఎప్పుడో మూలాన పడిపోయి ఉన్న ఇలాంటి సినిమాలను.. ఇదే పద్ధతిలో విడుదల చేసుకుంటే కొంతవరకూ అయినా క్యాష్ చేసుకోవచ్చు. పైరసీ ఎఫెక్ట్ కనుక లేకపోతే..
ఈ వీకెండ్ పూర్తయ్యేవరకూ ‘నర్తనశాల’ మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నిజానికి ‘నర్తనశాల’ ను.. బాలకృష్ణ పుట్టినరోజునే విడుదల చెయ్యాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం తీసుకోలేకపోయారని తెలుస్తుంది.