చిరంజీవి మెగాస్టార్ లో మాంచి ఫామ్ లో ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ బదులు నైజాం రైట్స్ ను తీసుకొనేవాడట. దాంతో.. తనకు సాధారణంగా వచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ పైకం ముట్టుతుండడంతో అన్నీ సినిమాలకూ అదే ఫాలో అయ్యేవారు చిరంజీవి. ఆ తర్వాత కొందరు హీరోలు ఆ ఫార్మాట్ ను ఫాలో అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ సరైన రిజల్ట్ రాలేదు. దాంతో ఆ ప్రొసెస్ ను పక్కన పెట్టేసి ఎప్పట్లానే రెమ్యూనరేషన్స్ తీసుకోవడం కంటిన్యూ చేశారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రామ్ చరణ్ తన తండ్రిని ఫాలో అవుతూ నైజాం రైట్స్ ను రెమ్యూనరేషన్ బదులు తీసుకోవడం మొదలెట్టాడు. ఇక మహేష్ బాబైతే ఏకంగా టోటల్ ప్రొడక్షన్ లో షేర్ తీసుకోవడం మొదలెట్టాడు.
ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా మహేష్, చరణ్ లను ఫాలో అవుతూ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను నటించబోయే చిత్రానికి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలో షేర్ లేదా నైజాం రైట్స్ తీసుకోవాలనుకొంటున్నాడట. ఆల్రెడీ హారికా & హాసిని క్రియేషన్స్ సంస్థ కూడా ఇందుకు అంగీకరించినట్లు.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రొసెసింగ్ మొదలుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.