తమిళ సూపర్ హిట్ రీమేక్ కోసం సమంతను ఫైనల్
- February 6, 2019 / 12:28 PM ISTByFilmy Focus
పెళ్ళైన తర్వాత కూడా వరుసబెట్టి సినిమాలు చేయడమే కాక బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంటూ సూపర్ సక్సెఫ్ ఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్న సమంతకు ఇప్పటికీ బోలెడన్ని ఆఫర్లున్నాయి. అయితే.. రీసెంట్ గా సమంత ఒక కుర్ర హీరో సరసన రెండోసారి నటించడానికి ఒకే చెప్పిందని వార్తలొస్తున్నాయి. ఆ లక్కీ యంగ్ హీరో మరెవరో కాదు మన బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం కాజల్ తో ‘సీత” అనే సినిమా చేస్తున్న శ్రీనివాస్ ఆ సినిమా తర్వాత టైగర్ నాగేశ్వర్రావు బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళ సూపర్ హిట్ చిత్రం “రాక్షసన్”ను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
- ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు.. కారణమేమిటంటే..!
- హీరో జై తో ఎఫైర్… పై అంజలి కామెంట్స్!
- హైద్రాబాద్ లో మహేష్ బాబు విగ్రహం
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో తొలుత కథానాయికగా కాజల్ పేరు వినిపించడంతో.. బెల్లకొండ కాజల్ తో హ్యాట్రిక్ కొడుతున్నాడని అందరూ కుళ్లుకున్నారు. మరి వాళ్ళ దిష్టి తగిలిందో లేక బాబుకి బోర్ కొట్టిందో తెలియదు కానీ.. కొత్త హీరోయిన్ కోసం వెతకడం మొదలెట్టారు. అయితే.. కొత్తగా క్రేజ్ ఉన్న కథానాయికలు ఎవరూ లేకపోవడంతో తన పరిచయ చిత్రంలో తనకు జంటగా నటించిన సమంతతోనే మళ్ళీ నటించాలని ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ బాబు. కథానాయకుడికంటే కథకు ఎక్కువ విలువ ఇచ్చిన సమంత ఒకే చెప్పిందని సమాచారం.














