ఈ ఏడాది సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో కాంతార సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కన్నడ సంస్కృతి, సాంప్రదాయాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి తాజాగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కాంతార మూవీ అత్యద్భుతంగా ఉందని ఆయన అన్నారు. కాంతార మూవీలో ఎలాంటి లోపాలు లేవని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు.
కాంతార సినిమాను థియేటర్ లో చూడలేకపోవడం తన దురదృష్టం అని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట కాంతార సినిమా గురించి విన్న సమయంలో ఈ సినిమా ఆత్మలకు సంబంధించిన సినిమా అని అనుకున్నానని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగులో తెరకెక్కిన మా భూమి తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. కాంతార సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు కథనం హైలెట్ అయిందని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.
ఈ సినిమాలో జమీందార్ విలన్ అని ఎవరూ భావించరని అయితే ఆ తర్వాత ఈ విషయాన్ని రివీల్ చేసి షాకిచ్చారని పరుచూరి అన్నారు. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ సహజంగా యాక్ట్ చేశారని ఆయన తెలిపారు. కాంతార సినిమాకు సంబంధించి ఎలాంటి లోపాలను తాను గమనించలేదని పరుచూరి పేర్కొన్నారు. ఈ సినిమాలో నాకు ఎలాంటి లోపాలు కనిపించలేదని ఆయన కామెంట్లు చేశారు.
ఈ రీజన్ వల్లే ప్రేక్షకులు ఈ సినిమాకు అద్భుతమైన విజయాన్ని అందించారని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంతార గురించి పరుచూరి పాజిటివ్ కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. కాంతార సక్సెస్ తో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల దిశగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగులు పడుతున్నాయి.