పవన్ కళ్యాణ్ రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే పక్కా ప్రణాళికతో వచ్చాడు. పొలిటికల్ లీడర్ గా ఉన్న నేపథ్యంలో ఎంట్రీ కమర్షియల్ మూవీతో కాకుండా ఓ సోషల్ కాన్సెప్ట్ మూవీ చేస్తే బాగుంటుందని ఆ తరహా మూవీ ఎంచుకున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తో వకీల్ సాబ్ మూవీ చేస్తున్న పవన్ ఆ మూవీలో లాయర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావడం జరిగింది. ఐతే 20 రోజుల షూట్ మాత్రం మిగిలివుంది.
అలాగే దర్శకుడు క్రిష్ తో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు కావడం విశేషం. ఏక కాలంలో రెండు సినిమాలు పూర్తి చేసి హరీష్ శంకర్ తో చేయాల్సిన 28వ చిత్రం కూడా 2022 లోపు పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలనేది పవన్ ప్లాన్. ఐతే లాక్ డౌన్ కారణంగా ఈ ప్రణాళిక డిస్టర్బ్ అయ్యింది. ఆయన మొదలుపెట్టిన రెండు సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి.
తాజా ఇంటర్వ్యూలో కూడా పవన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. షూటింగ్ పునఃప్రారంభం ఇప్పట్లో ఉండకపోవచ్చు. వాక్సిన్ వస్తే తప్ప ధైర్యంగా షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితి అని చెప్పారు. వాక్సిన్ రావడానికి మరో ఏడాది సమయం పడుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ క్రిష్ మూవీ పూర్తి చేయడానికి ఏడాదిన్నర సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ మూవీ ఎన్నికలకు ముందు పూర్తి చేయడం కష్టమే అనే మాట వినబడుతుంది. మరి అదే కనుక జరిగితే అటు పవన్ ఫ్యాన్స్ కి మరియు హరీష్ కి తీవ్ర నిరాశ తప్పదు.