‘పవన్ కళ్యాణ్ ని తిట్టమని శ్రీరెడ్డికి చెప్పింది నేనే’ అని వర్మ నిన్న సాయంత్రం రెస్పాండ్ అవ్వడం దగ్గర్నుంచి వర్మ మీద ఇండస్ట్రీ మొత్తం రివర్స్ అయ్యింది. ఇక ఇవాళ అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి ఇండైరెక్ట్ గా వర్మను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఇక నిన్న పవన్ కళ్యాణ్ తోపాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితర మెగా హీరోలందరూ వర్మ & కో మీద యుద్ధం ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది.
అయితే.. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు నాగార్జున తాజా చిత్రమైన “ఆఫీసర్” మీద పడే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని తెలుస్తోంది. వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన నాలుగో చిత్రం “ఆఫీసార్”. నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రాన్ని వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల టీజర్ ను కూడా విడుదల చేశారు, ఆ టీజర్ అంత ఆసక్తికరంగా లేదనుకోండి అది వేరే విషయం. అయితే.. ప్రస్తుత పరిశ్రమ పరిస్థితులను పరిశీలిస్తే.. ఆ సినిమా విడుదలకు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేసేలా కనిపించడం లేదు. నాగార్జున మీద ఎవరికీ నెగిటివ్ ఫీలింగ్ లేకపోయినా.. ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ అనే ఒకే ఒక్క కారణంతో “ఆఫీసర్” సినిమా విడుదల ఆలస్యం అవ్వడం లేదా ఆగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ విషయమై క్లారిటీ రావాలంటే నాగార్జున రంగంలోకి దిగాల్సిందే.