యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రాల తర్వాత అనేక ఆఫర్లు వచ్చాయి. వాటిలో బాలీవుడ్ అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పద్మావత్ ఉండడం విశేషం. బ్లాక్, రామ్‌లీలా, బాజీరావు మస్తానీ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా పద్మావత్. రాణి పద్మావతిగా దీపికా పదుకొన్, అల్లావుద్దీన్ ఖిల్లీగా రణ్‌వీర్ సింగ్, రావల్ రతన్ సింగ్‌గా షాహీద్ కపూర్ బాగా నటించి అదరగొట్టారు. విమర్శలను దాటుకొని విజయాన్ని అందుకుంది. ఇటువంటి సినిమాలో చిన్న రోల్ వచ్చినా చాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ రావల్ రతన్ సింగ్‌గా నటించమని ప్రభాస్ ని కోరారట. కానీ ఆ అఫర్ ని ప్రభాస్ తిరస్కరించారు. దాంతో ఆ పాత్రను షాహిద్ కపూర్ పోషించాల్సి వచ్చింది.
అయితే ప్రభాస్‌కి ఈ ఆఫర్ వచ్చినపుడు రాణి పద్మావతి పాత్రకు ఐశ్వర్యారాయ్‌ను అనుకున్నారట. అది తెలిసినా ఆ సినిమాను ప్రభాస్ తిరస్కరించాడని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. పద్మావత్‌లో రావల్ రతన్ సింగ్ పాత్ర తన రేంజ్‌కు తగ్గట్టు లేదని ప్రభాస్ భావించడమే సినిమా అంగీకరించకపోవడానికి కారణమని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వేసవికి థియేటర్లోకి రానుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.