తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి.ఇందులో దిల్ రాజు ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సి. కళ్యాణ్ ప్యానల్ పై దిల్ రాజు ప్యానల్ ఘన విజయం సాధించింది.అయితే దిల్ రాజు జనరల్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.దిల్ రాజుకి కూడా ఎంపీగా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం ఉంది. సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించిన సందర్భాలు చాలా తక్కువ. దాసరి నారాయణరావు మాత్రమే కొన్నాళ్ల పాటు చక్రం తిప్పారు.
కృష్ణంరాజు వంటి వాళ్ళు గెలిచినా వాళ్ళు దాసరిలా పవర్ ఫుల్ పొలిటీషియన్లు కాలేకపోయారు. పనిలో పనిగా సినిమా పరిశ్రమకు అవసరమైన సేవలు కూడా చేశారు దాసరి. ఆయన ప్లేస్ ను ఎవరూ భర్తీ చేయలేకపోయారు. దిల్ రాజు అయితే ఎంపీ అవ్వాలనే ఆశలు కలిగి ఉన్నట్లు అందుకోసం ప్రకటనలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. దిల్ రాజు బీఆర్ఎస్‌లో చేసే అవకాశాలు ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా. దిల్ రాజు తన సొంత ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించడమే కాకుండా ఘనంగా ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు.
బీఆర్ఎస్‌లో (Dil Raju) దిల్ రాజుకి.. నిజామాబాద్ నుండి సీటు వచ్చే అవకాశం లేదు.అది కల్వకుంట్ల కవితకు చెందినది. కాబట్టి దిల్ రాజు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుండీ కూడా మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. కానీ ఎక్కువ సార్లు గెలిచిన సందర్భాలు లేవు. కాబట్టి..దిల్ రాజుకి ఉన్న ఫాలోయింగ్ రీత్యా ఆయనకు ఎంపీ సీటు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి.