Rajamouli: బాహుబలి3 మూవీ కథ అలా ఉండబోతుందా?

బాహుబలి2 సినిమా సాధించిన సంచలన రికార్డులు అన్నీఇన్నీ కావు. బాహుబలి2 ఫుల్ రన్ లో ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాహుబలి2 సినిమాకు కొనసాగింపుగా బాహుబలి3 కూడా తెరకెక్కనుందని కొన్ని నెలల క్రితం జక్కన్న చేసిన ప్రకటన హాట్ టాపిక్ అయింది. అయితే బాహుబలి3 సినిమా గురించి జక్కన్న బాహుబలి2 సినిమాలోనే హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా పనులతో బిజీగా ఉండగా

అమెరికాలో లాస్ ఏంజిల్స్ మూవీ మారథాన్ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ లో జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు ప్రదర్శించబడ్డాయి. ఈ ఈవెంట్ లో క్యూ అండ్ ఏ సెషన్ ను నిర్వహించగా జక్కన్న బాహుబలి3 తీస్తానని చెప్పుకొచ్చారు. బాహుబలి2 ఎండ్ క్రెడిట్స్ లో చిన్న పాప మహేంద్ర బాహుబలి కొడుకు మాహష్మితికి మళ్లీ రాజవుతాడా? అని అడగగా శివయ్య మనసులో ఏమనుకుంటున్నాడో నాకేం తెలుసు అంటూ తనికెళ్ల భరణి సమాధానం ఇస్తారు.

బాహుబలి3 సినిమా కోసం ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి3 సినిమా తెరకెక్కితే ఆ సినిమా బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి బాహుబలి3 సినిమాపై తన కామెంట్లతో అంచనాలను పెంచేశారు.

బాహుబలి, బాహుబలి2 సినిమాలను నిర్మించిన నిర్మాతలే బాహుబలి3 సినిమాను నిర్మిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాల షూటింగ్ పూర్తైన తర్వాతే బాహుబలి3 తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ సినిమా తర్వాత జక్కన్న ఈ సినిమాపైనే దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus