ప్రభాస్ ఒక రోజు ఎన్ని బిర్యానీలు తిన్నాడో తెలుసా!
- June 6, 2017 / 05:51 AM ISTByFilmy Focus
ప్రభాస్ సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ బాడీని తన కంట్రోల్లో ఉంచుకున్నారు. ఎలా కావాలనుకుంటే అలాగ మలుచుకునే వారు. ముఖ్యంగా బాహుబలి కోసమైతే చాలా ఎక్కువగానే డైట్ పాటించారు. ఐదేళ్ల పాటు కఠోర దీక్షలాగా ఫిట్ నెస్ నిపుణులు చెప్పినట్లుగా ఆహరం తీసుకునేవారు. ఆ కష్టాన్ని చూసిన రాజమౌళి ప్రభాస్ కి అప్పుడప్పుడు ‘చీటింగ్ మీల్ డే’ పేరుతో ఆఫర్ ఇచ్చేవారు. ఆరోజు ఇష్టమైనవి ఎంత తిన్నా జక్కన్న అడ్డు చెప్పేవారు కాదు.
అలాంటి ఓ రోజు ప్రభాస్ ఏమి చేసాడంటే.. ఏకంగా 15 రకాల బిరియానీలను తినేసాడంటా. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నిజం. ఈ విషయాన్నీ స్వయంగా రాజమౌళే ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. దీంతో బాహుబలి బిర్యానీ ప్రియుడు అని అందరికీ తెలిసిపోయింది. అంతేకాదు నాన్ వెజ్ లో ఎక్కువ వెరైటీలను తినేందుకు ఆసక్తి చూపిస్తాడని వివరించారు. వాటిలో చికెన్, మటన్ తో పాటు రొయ్యలతో చేసిన వంటకాలు తప్పనిసరిగా ఉండేవని రాజమౌళి తెలిపారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















