సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవలే కరోనా నుండి కోలుకున్నారు. ఒకానొక దశలో ప్రాణాపాయ స్థితికి వెళ్లిన ఆయన చివరికి కోలుకున్నారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత రీసెంట్ గా జీహెచ్ఎంసీ ఎలెక్షన్స్ లో ఓటేస్తూ కనిపించారు. పూర్తిగా కోలుకున్న తరువాత కొత్త ఏడాదిని కొత్త సినిమాతో ఆరంభించాలని ఆయన కోరుకుంటున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రాజశేఖర్ అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనికి నిర్మాతలు కూడా సెట్ అయ్యారు.
రాజశేఖర్ వైపు నుండి ఈ సినిమా ఆర్ధిక సహాయం అందబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటపడింది. రాజశేఖర్ తో నీలకంఠ తీసేది స్ట్రెయిట్ సినిమా కాదట. మలయాళంలో రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘జోసెఫ్’ సినిమాను ఇప్పుడు తెలుగులో తీస్తున్నారట. ఈ సినిమాలో జాజు జార్జ్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రధాన పాత్ర పోషించారు. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.
నలుగురు రిటైర్ పోలీస్ ఆఫీసర్ల చుట్టూ నడిచే కథ ఇది. షాబు కబీర్ అనే రచయిత తన నిజ జీవిత అనుభవాల నేపథ్యంలో దర్శకుడు పద్మకుమార్ ఈ సినిమాను రూపొందించాడు. మూడు కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఎనిమిది కోట్ల వరకు రాబట్టింది. అలానే కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా రీమేక్ నమ్ముకున్న నీలకంఠ.. రాజశేఖర్ కి హిట్ ఇస్తారేమో చూడాలి!